Excursion : విహారయాత్రకు తీసుకెళ్లి భార్యను “లోయలో” తోసిన భర్త

తనను జైలుకు పంపిందన్న కోపంతో భార్యను హత్యచేశాడు భర్త.. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ లో చోటుచేసుకుంది. కేసును చెందించిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. హత్యకేసు నమోదు చేసి విచారణ చేపట్టారు

Excursion : విహారయాత్రకు తీసుకెళ్లి భార్యను “లోయలో” తోసిన భర్త

Excursion

Excursion : భార్యను కొండపైనుంచి తోసి హత్యచేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేష్ (24) అనే వ్యక్తి ఢిల్లీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి 29 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించి అనేకసార్లు సదరు యువతితో ఏకాంతంగా గడిపాడు. అయితే కొంతకాలం తర్వాత మోహచాటేశాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు అనంతరం కోర్టు శిక్ష విధించడంతో తీహార్ జైలుకు తరలించారు.

తీహార్ జైల్లో ఉన్న సమయంలో అధికారుల సాయంతో ఆ యువతితో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని కేసు వెనక్కు తీసుకోవాలని కోరాడు. దీనికి ఆమె ఒప్పుకోవడంతో రాజేష్ జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత డిసెంబర్ లో, రాజేష్ సదరు యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది జూన్ లో ఆమెను ఉత్తరాఖండ్ లోని తన సొంత ఉరికి తీసుకెళ్లాడు. విహారయాత్ర కోసం నైనిటాల్ వెళ్లారు. అక్కడే ఓ గృహాల్లో ఏకాంతంగా గడిపారు.

అనంతరం గృహనుంచి బయటకు వచ్చారు. ఆమెను చంపాలని ముందే పథకంతో ఉన్న రాజేష్.. గృహలోంచి బయటకు రాగానే పక్కనే ఉన్న లోయలోకి తోశాడు. అనంతరం ఇంటికి వెళ్ళిపోయాడు. ఢిల్లీలో ఉన్న యువతి తల్లిండ్రులు ఆమెకు అనేకసార్లు ఫోన్ చేశారు. ఫోన్ అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చి ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిగ్నల్స్ ఆధారంగా ఫోన్ లాస్ట్ ఎక్కడి నుంచి తీసుకుందో తెలుసుకున్నారు. అదే సమయంలో రాజేష్ ఫోన్ సిగ్నల్స్ కూడా పరిశీలించారు. ఇద్దరి ఫోన్ సిగ్నల్స్ ఒకే టవర్ నుంచి రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

ఉత్తరాఖండ్ లో ఉన్న రాజేష్ ను అదుపులోకి తీసుకోని విచారించారు. ఈ విచారణలో అతడు నిజం ఒప్పుకున్నాడు. మొదట కాలు జారిపడిందని చెప్పిన రాజేష్.. ఆ తర్వాత తానే హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేశారు. యువతి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.