Sudipto Sen : కొత్త సినిమా ప్రకటించిన కేరళ స్టోరీ దర్శకుడు.. ఈసారి ఛత్తీస్‌గఢ్‌ టెర్రరిస్ట్‌ అటాక్‌!

కేరళ స్టోరీ సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుదీప్తో సేన్‌, నిర్మాత విపుల్‌ అమృత్‌లాల్‌ షా.. తమ కొత్త సినిమా ప్రకటించారు. ఈసారి ఛత్తీస్‌గఢ్‌ టెర్రరిస్ట్‌ అటాక్‌‌తో..

Sudipto Sen : కొత్త సినిమా ప్రకటించిన కేరళ స్టోరీ దర్శకుడు.. ఈసారి ఛత్తీస్‌గఢ్‌ టెర్రరిస్ట్‌ అటాక్‌!

The Kerala Story director Sudipto Sen announce his new movie Bastar

Sudipto Sen : ఈ ఏడాది వివాదాలు, నిషేధాలు మధ్య రిలీజ్ అయిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). కేరళలోని అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కాంట్రవర్సియల్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో అదా శర్మ (Adah Sharma) మెయిన్ లీడ్ చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం ఇండియా వైడ్ భారీ కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలు కూడా 100 కోట్లు అందుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో కేరళ స్టోరీ ఎన్నో ఇబ్బందులు మధ్య రిలీజ్ అయ్యి 300 కోట్ల మార్క్ ని అందుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

Harish Shankar : కేంద్రమంత్రిని కలిసిన హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయం ఏంటంటూ కామెంట్స్!

ఈ చిత్రానికి ‘సుదీప్తో సేన్‌’ దర్శకత్వం వహించగా ‘విపుల్‌ అమృత్‌లాల్‌ షా’ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా వీరిద్దరూ కలిసి మరో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. 2010 ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ ప్రాంతంలో జరిగిన టెర్రరిస్ట్‌ అటాక్‌ ని స్టోరీ లైన్ గా తీసుకోని ‘బస్తర్‌’ (Bastar) అనే టైటిల్ ని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ వెల్లడించాడు. త్వరలోనే మూవీలో నటించే నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామంటూ చెప్పుకొచ్చాడు.

Upasana : డెలివ‌రీకి ముందు.. రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల ఆనందాన్ని చూశారా..?

కాగా కేరళ స్టోరీ తరహాలోనే 2022 లో వచ్చిన మరో సినిమా ‘కాశ్మీర్ ఫైల్స్’. ఈ మూవీ కూడా అప్పటిలో ఎన్నో వివాదాలు ఎదురుకున్నా చివరికి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా తన తదుపరి సినిమాని ప్రకటించి చిత్రీకరణ జరుపుతున్న విషయం తెలిసిందే. ‘ది వాక్సిన్ వార్’ అంటూ కరోనా నేపథ్యంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బస్తర్‌ అండ్ ది వాక్సిన్ వార్ చిత్రాలు పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి వాటిని ఆ దర్శకులు అందుకుంటారో లేదో చూడాలి.