Heavy Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో రానున్న నాలుగు రోజులూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఇవాళ ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.

Heavy Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు

Rains

heavy rains : ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో రానున్న నాలుగు రోజులూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఇవాళ ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మంచిర్యాల, కొమురంభీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇక.. రేపు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ… ఆ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీచేసింది. మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ ఇచ్చింది. అంతేకాదు…రాబోయే 4 వారాల పాటు వ‌ర్షాలు స‌మృద్ధిగా కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉప‌రిత‌ల ఆవ‌ర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. హైద‌రాబాద్ ప‌రిస‌ర జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చరించింది. వర్షాల దృష్ట్యా నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Poisonous Snakes : మంచిర్యాలలో విష సర్పాల కలకలం..వర్షాలు, వరదలకు కొట్టుకొచ్చిన పాములు

హైదరాబాద్‌ పరిసర జిల్లాలైన మెదక్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో మెదక్‌ జిల్లా చేగుంటలో అత్యధికంగా 23.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మెదక్‌లో 23, దేవరప్పులలో 23, దంతాలపల్లిలో 22, శంకరంపేట్‌లో 21, వెంకటాపురంలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 5 సెంటీమీటర్ల వాన పడినట్లు పేర్కొంది.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. వర్షాలపై ఆయన నిన్న కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. వరసగా రెండు రోజుల పాటు సెలవులు ఉన్నందున, వాటిని ఉపయోగించుకోకుండా పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. పోలీసు, నీటిపారుదల, రోడ్లు-భవనాలు, విద్యుత్తు, రెవెన్యూ తదితర శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని తెలిపారు.