Heavy Rains : హైద‌రాబాద్ లో రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు..రెడ్ అల‌ర్ట్‌ జారీ

మరోవైపు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ప్ర‌భావంతో రాష్ట్రంలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే, భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.

Heavy Rains : హైద‌రాబాద్ లో రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు..రెడ్ అల‌ర్ట్‌ జారీ

Rain

heavy rains : హైద‌రాబాద్ లో రాబోయే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ మేరకు న‌గ‌రానికి రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఈ మూడు రోజుల్లో హైద‌రాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే, తెలంగాణ‌లోని 14 జిల్లాల‌కు కూడా వాతావ‌ర‌ణ శాఖ‌ భారీ వ‌ర్ష సూచ‌న చేసింది.

మరోవైపు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ప్ర‌భావంతో రాష్ట్రంలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే, భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ్లాల‌ని సూచించింది.

Rains In Telangana : రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు

అవ‌స‌ర‌మైతేనే ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని తెలిపింది. ఇప్ప‌టికే కురిసిన భారీ వ‌ర్షాల‌కు రాష్ట్రంలోని అన్ని జ‌లాశ‌యాలు జ‌ల‌క‌ళ సంతరించుకున్నాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. రైతులు కూడా పొలాల బాట ప‌ట్టి, వ్య‌వ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్న‌మయ్యారు.