Dharmapuri Strong Room : హైకోర్టు ఆదేశాలతో ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టిన అధికారులు
హైకోర్ట్ ఆదేశాలతో ఎన్నికల అధికారులు డాక్యుమెంట్లు స్కానింగ్ చేసి నివేదిక ఇవ్వనున్నారు. ఎన్నికల అబ్జర్వర్ అవినాష్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నారు.

Dharmapuri Strong Room
Dharmapuri Strong Room : జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలను సిబ్బంది పగులగొట్టింది. ఆదివారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఈవీఎం స్ట్రాంగ్ రూముల తాళాలను అధికారులు పగులగొట్టారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టారు. ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్ అవ్వడంతో హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు పగులగొట్టారు.
అయితే, అధికారుల నివేదికలో 17 సి డాక్యుమెంట్లు ఫామ్ కీలకం కానున్నాయి. 17సీ ఫామ్ లో నమోదు చేసి ఓట్ల సంఖ్య ఈవీఎంలో నమోదైన ఓట్లతో ట్యాలీ కావాల్సి ఉంది. టోటల్ ఓట్లతో పాటుగా పోలైన ఓట్లు, అభ్యర్థులకు వచ్చిన వివరాలన్నీ 17సి డాక్యుమెంట్లో ఉంటాయి.
ఇక 17 ఏ డాక్యుమెంట్ల పోలింగ్ శాతం ఉంటుంది. పోలైన ఓట్లకు.. ప్రకటించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందని పిటిషన్ దారుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపణలు చేస్తున్నారు. హైకోర్ట్ ఆదేశాలతో ఎన్నికల అధికారులు డాక్యుమెంట్లు స్కానింగ్ చేసి నివేదిక ఇవ్వనున్నారు.
Dharmapuri Election Issue : ధర్మపురి రీకౌంటింగ్‌పై హైకోర్ట్‌లో విచారణ
ఎన్నికల అబ్జర్వర్ అవినాష్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు పగులగొట్టారు. మరోవైపు ధర్మపురి ఎన్నిక ఫలితం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి కోర్టుకెళ్లారు.