Otters : నాగార్జున సాగర్ జలాశయంలో నీటికుక్కల సందడి

సాగర్ జలాశయాల్లో కలియదిరుగుతూ వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో లాంచ్ స్టేషన్ వద్ద దర్శనమిచ్చాయి.

Otters : నాగార్జున సాగర్ జలాశయంలో నీటికుక్కల సందడి

Otters

Otters : కనుమరుగైపోతున్న జాతుల్లో నీటికుక్కలు కూడా ఒకటి. అటు భూమి మీద ఇటు నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో నీటికుక్కలు కూడా ఒకటి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నీటికుక్కల ఉనికిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఉప్పల పాడు పక్షుల కేంద్రంలో నీటికుక్కలను గుర్తించగా తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి కుక్కలు దర్శనమిచ్చాయి.

సాగర్ జలాశయాల్లో కలియదిరుగుతూ వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో లాంచ్ స్టేషన్ వద్ద దర్శనమిస్తున్నాయి. చేపల్ని ఆహారంగా తీసుకుని నీటికుక్కలు జీవనం సాగిస్తుంటాయి. రెండేళ్ళ క్రితం ఒకసారి సాగర్ జలాల్లో నీటికుక్కలను గుర్తించారు. అయితే ఆతరువాత కాలంలో అవి కనిపించకుండా పోయాయి. తాజాగా సాగర్ జలాల్లో గతంలో కంటే ఎక్కవ సంఖ్యలోనే నీటి కుక్కలు జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వీటి సంతతి పెరుగుతున్నట్లు స్పష్టమౌతుంది. అంతరించి పోతున్న అరుదైన జాతికావటంతో  వీటిని సంరక్షించాలని పర్యాటకులు, జంతుప్రేమికులు కోరుతున్నారు.