MLA Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు తమ పరిధిలోకి రాదని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.

MLA Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana govt

MLA purchase case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు తమ పరిధిలోకి రాదని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సింగిల్ బెంచ్ ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ప్రభుత్వం రిట్ అప్పీల్ పిటిషన్ వేసింది. ప్రభుత్వ రిట్ అప్పీల్ పిటిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. సుప్రీంకోర్టుకు వెళ్లేంత వరకు సీబీఐ విచారణ నిలిపి వేయాలని కోరింది. కాగా, ప్రభుత్వ వినతిని హైకోర్టు నిరాకరించింది. దీంతో ఏ క్షణంలోనైనా ఈ కేసుఫై సిబిఐ ఎఫ్ఐఆర్ చేయనుంది. ఇప్పటికే కేసు వివరాలు ఇవ్వాలని చీఫ్ సెక్రెటరీకి సీబీఐ లేఖ రాసింది.

MLA Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిన్న హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును అమలు చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. సీబీఐతో విచారణ జరపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసింది. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 111 పేజీలతో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ముగ్గురు నిందితుల హక్కులను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకున్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ ను పూర్తిగా సమర్దిస్తామని తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన రామ్ కిషన్ ఫోజి తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. లెటర్స్ పేటెంట్ క్లాస్ 15 ప్రకారం కేసు పూర్తిగా క్రిమినల్ జురడిక్షన్ పరిధిలోకి వస్తుందని తెలిపింది. మెరిట్స్ లోకి వెళ్లకుండా క్రిమినల్ జురిడిక్షన్ పైనే ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది.