Praja Sangrama Padayatra : ఆ ప్రాజెక్టుకు డీపీఆర్ ఎందుకివ్వడం లేదు కేంద్ర మంత్రి ప్రశ్న

తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రధాన విషయాలను సీఎం కేసీఆర్ మరిచిపోయారని విమర్శించారు. ఆయన ఇచ్చిన హామీలున గుర్తు చేసేందుకు బండి సంజయ్ పాదయాత్ర

Praja Sangrama Padayatra : ఆ ప్రాజెక్టుకు డీపీఆర్ ఎందుకివ్వడం లేదు కేంద్ర మంత్రి ప్రశ్న

Dpr

Praja Sangrama Padayatra : తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది. కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికలతో ముందుకెళుతోంది. అందులో భాగంగా.. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వారు టి.సర్కార్ పై విమర్శలు వర్షం కురిపిస్తుండడం.. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పాలిటిక్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. 2022, ఏప్రిల్ 20వ తేదీ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతోంది.

Read More : Praja Sangrama Pada Yatra : ప్రజాసంగ్రామ యాత్ర కాదు…ప్రజావంచన యాత్ర-కేటీఆర్

ఈ యాత్రలో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద సింగ్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి DPR ఎందుకివ్వడం లేదని సూటిగా ప్రశ్నించారు. నీటి కేటాయింపులు లేకుండా ఎలా ఇస్తారు ? తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రధాన విషయాలను సీఎం కేసీఆర్ మరిచిపోయారని విమర్శించారు. ఆయన ఇచ్చిన హామీలున గుర్తు చేసేందుకు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిచడం జరుగుతోందన్నారు. RDSపై ఇచ్చిన హామీ ఏమైంది ? కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఏమైంది అని ప్రశ్నించారు.

Read More : Bandi Sanjay : భారీ కాన్వాయ్‌తో గద్వాల్‌కు బండి సంజయ్.. ఈ సాయంత్రమే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర..!

RDSలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమస్య పరిష్కారమయ్యేందుకు బోర్డు కృషి చేయడం జరుగుతుందని, ఆర్డీఎస్ (RDS) చివరి ఆయుకట్టు వరకు నీరందిస్తామని హామీనిచ్చారు.
టెలి మెట్రిక్ సిస్టం ఏర్పాటు చేయడం జరుగుతుందని, కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజక్ట్ లపై చూపడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో హత్యలు, దాడులకు పాల్పడడం సమంజసం కాదన్న మంత్రి ప్రహ్లాద సింగ్ తెలంగాణలో అత్యంత అవినీతి పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఇక ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు.