Crime News: పెళ్లయిన కొద్దిరోజులకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. ఎలా దొరికారంటే..

పెద్దలు ఒత్తిడి తెచ్చారని ఇష్టలేని పెళ్లి చేసుకోవటం, పెళ్లి తరువాత ప్రియుడితో భర్తను హత్యచేయడం.. ఇలాంటి తరహా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి తరహా ఘటన ...

Crime News: పెళ్లయిన కొద్దిరోజులకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. ఎలా దొరికారంటే..

Crime News

Crime News: పెద్దలు ఒత్తిడి తెచ్చారని ఇష్టలేని పెళ్లి చేసుకోవటం, పెళ్లి తరువాత ప్రియుడితో కలిసి భర్తను హత్యచేయడం.. ఇలాంటి తరహా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి తరహా ఘటన సిద్ధిపేట జిల్లా టూటౌన్ పరిధిలో చోటు చేసుకుంది. పెళ్లయిన 35రోజులకే భర్తను చంపేందుకు భార్య రెండు సార్లు ప్రియుడితో ప్లాన్ వేసింది. మొదటి ప్లాన్ బెడిసి కొట్టడంతో రెండవసారి పక్కా ప్రణాళికతో బయటకు తీసుకెళ్లి ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి హత్య చేయించింది. శ్యామల కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుట్టురట్టు చేశారు. తొగుట మండలం గుడికందులకు చెందిన శ్యామలకు, దుబ్బాక మండలం చిన్ననిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్(24)తో మార్చి 23న పెళ్లి జరిగింది.

Crime News: యువతినంటూ మహిళలకే టోకరా వేసిన కేటుగాడు: 500 మంది నుంచి రూ.3.5 కోట్లు స్వాహా

గుడికందులకు చెందిన శివకుమార్, శ్యామల మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇష్టంలేని పెళ్లి చేశారని, తన భర్తను అడ్డుతొలగించుకుంటే ప్రియుడు శివతో సంతోషంగా ఉండొచ్చని శ్యామల భావించింది. అనుకున్నదే తడవుగా భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఏప్రిల్ 19న చంద్రశేఖర్ తినే ఆహారంలో ఎలుకల మందు కలిపి పెట్టింది. తీవ్ర అనారోగ్యం పాలైన చంద్రశేఖర్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది ఏప్రిల్ 22న ఇంటికి వచ్చాడు. తొలి ప్రయత్నం విఫలం కావడంతో.. రెండవ ప్రయత్నంలో ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఏప్రిల్ 28న చిన్నకోడూర్ మండలం అనంతసాగర్ లోని సరస్వతీ ఆలయంలో మొక్కు ఉందని చెప్పి భర్తతో కలిసి శ్యామల బైక్ పై బయలుదేరింది. అనంతసాగర్ శివారులోని ధన్వంతరి అగ్రహారానికి వెళ్లే మట్టి దారిలోకి తీసుకెళ్లింది. అప్పటికే ప్రియుడు శివ, అతని స్నేహితులు చంద్రశేఖర్ ను హత్యచేసేందుకు కారులో మాటువేసి ఉన్నారు. దగ్గరకు రాగానే చంద్రశేఖర్ పై దాడిచేసి తువాలతో మెడచుట్టూ చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

AP Crime : గంజి ప్రసాద్ హత్యకు మూడు రోజులు రెక్కీ..12మందిపై కేసు నమోదు..ఆరుగురు అరెస్ట్ : ఎస్సీ రాహుల్ దేవ్ శర్మ

అనంతరం మృతదేహాన్ని కారులో సిద్ధిపేట శివారుకు తీసుకొచ్చారు. ప్లాన్ ప్రకారం శ్యామలం భర్త కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చంద్రశేఖర్ కు ఛాతిలో నొప్పివచ్చిందని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని, 108 వాహనంలో సిద్ధిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తున్నానని చెప్పంది. కొడుకు మృతిపై అనుమానంతో చంద్రశేఖర్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్యామలపై అనుమానంతో ఆమె కాల్ డేటా పరిశీలించగా అసలు గుట్టు‌రట్టయింది. దీంతో శ్యామల, ప్రియుడు శివతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.