Jio 5G Full List in India : రిలయన్స్ జియో 5G సపోర్టు చేసే 13 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీ ఫోన్లలో 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

Jio 5G Full List in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు 5G సపోర్టు చేసేందుకు రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కలిగి ఉంది. మీ Xiaomi లేదా Redmi ఫోన్‌లో 5Gని ఉపయోగించేందుకు వినియోగదారులు సెట్టింగ్‌ల మెను (Settings)కి వెళ్లడం ద్వారా ప్రాధాన్య నెట్‌వర్క్ టైప్ 5Gకి మార్చాలి.

Jio 5G Full List in India : రిలయన్స్ జియో 5G సపోర్టు చేసే 13 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీ ఫోన్లలో 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

Jio 5G Full List in India _ These 13 Xiaomi, Redmi Phones can now run Jio 5G

Jio 5G Full List in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు 5G సపోర్టు చేసేందుకు రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కలిగి ఉంది. మీ Xiaomi లేదా Redmi ఫోన్‌లో 5Gని ఉపయోగించేందుకు వినియోగదారులు సెట్టింగ్‌ల మెను (Settings)కి వెళ్లడం ద్వారా ప్రాధాన్య నెట్‌వర్క్ టైప్ 5Gకి మార్చాలి. సెట్టింగ్‌ని మార్చిన తర్వాత అర్హత ఉన్న Xiaomi లేదా Redmi ఫోన్ యూజర్ల Jio ‘True 5G’ సర్వీసును ఉపయోగించవచ్చు. Xiaomi 13 Mi, Redmi ఫోన్‌లలో Jio 5Gకి సపోర్టును తీసుకొచ్చేందుకు భారత అగ్ర టెలికాం ఆపరేటర్లలో ఒకటైన Reliance Jioతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ భాగస్వామ్యాన్ని ప్రకటిస్తూ ‘Redmi K50i, Redmi Note 11T 5G’ వినియోగదారులకు ఎలాంటి అవరోధం లేని కనెక్టివిటీని అందిస్తోంది. రిలయన్స్ జియో ట్రూ 5G నెట్‌వర్క్‌తో కచ్చితమైన టెస్టును అందిస్తున్నాయి. Xiaomi, Redmi నుంచి చాలా 5G రెడీ డివైజ్‌లు Reliance Jio ట్రూ 5G నెట్‌వర్క్‌తో అందుబాటులో ఉంటాయి. పూర్తి జాబితాను ఓసారి చెక్ చేయండి.

* Mi 11 Ultra 5G
* Xiaomi 12 Pro 5G
* Xiaomi 11T Pro 5G
* Redmi Note 11 Pro+ 5G
* Xiaomi 11 Lite NE 5G

Read Also : Reliance Jio 5G : రిలయన్స్ జియో నెట్‌వర్క్ నగరాల ఫుల్ లిస్ట్ ఇదే.. ఇండియాలో జియో 5G ధర ఎంత? ఎలా 5G యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

* Redmi Note 11T 5G
* Redmi 11 Prime 5G
* Redmi Note 10T 5G
* Mi 11X 5G
* Mi 11X Pro 5G
* Redmi K50i 5G
*Xiaomi 11i 5G
* Xiaomi 11i HyperCharge 5G

Xiaomi ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ భాగస్వామ్యం గురించి వ్యాఖ్యానిస్తూ.. ‘గత రెండు సంవత్సరాలుగా, Xiaomi #IndiaReady5G అందిస్తామనే హామీకి కట్టుబడి ఉంది. 5G విప్లవానికి సారథ్యం వహిస్తున్నాము. స్మార్ట్‌ఫోన్‌లు నిజాయితీతో కూడిన ధరలో అత్యుత్తమ ఫీచర్‌లతో 5G ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

Jio 5G Full List in India _ These 13 Xiaomi, Redmi Phones can now run Jio 5G

Jio 5G Full List in India _ These 13 Xiaomi, Redmi Phones

వినియోగదారు అనుభవాన్ని కనెక్టివిటీని మరింత మెరుగుపరచడానికి Reliance Jio ట్రూ 5G నెట్‌వర్క్‌తో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషిస్తున్నాము. వినియోగదారులు తమ Xiaomi, Redmi హ్యాండ్‌సెట్‌లలో రిలయన్స్ జియో ట్రూ 5G కలిగిన అత్యుత్తమ 5Gని పొందవచ్చునని సాయపడుతుందని భావిస్తున్నాము’ అని తెలిపింది.

రిలయన్స్ జియో (Reliance Jio) ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ సునీల్ దత్ మాట్లాడుతూ.. కొత్త టెక్నాలజీలను ఉపయోగించుకోవడానికి Xiaomi ఒక మార్గదర్శకంగా ఉందన్నారు. మొబైల్ వినియోగదారులకు ప్రతిదానికీ జియో కేంద్రంగా ఉందని తెలిపారు. యూజర్లకు నిజమైన 5G యాక్సెస్‌ను ప్రారంభించడం అనేది Jioకి ఒక స్థిరమైన లక్ష్యమని, రాబోయే అన్ని Xiaomi 5G డివైజ్‌లు ఇప్పటికే ఉన్న వాటితో పాటు SA కనెక్టివిటీని బాక్స్ వెలుపల కలిగి ఉంటాయని సంతోషిస్తున్నామన్నారు.

True 5Gకి సపోర్టు ఇచ్చేలా సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. Jio 5G సర్వీసులు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, నాథ్‌ద్వారా, పూణే, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌తో సహా 10+ భారతీయ నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇదివరకే.. 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా జియో 5G అందుబాటులోకి వస్తుందని రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G Services in India : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. నగరాల ఫుల్ లిస్టు ఇదిగో.. ఇండియాలో ధర ఎంత? ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?