2021 Telugu Films: తెలుగు సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమాలివే!

2021.. అన్ని ఇండస్ట్రీలను బయపెట్టినా.. టాలీవుడ్ ను నిలబెట్టింది. తెలుగు సినిమా అంటే ఇండియన్ సినిమా అన్న పేరు ఈ ఇయర్ లోనే బలపడింది. కొవిడ్ తో జనం థియేటర్స్ కొస్తారా రారా అన్న..

2021 Telugu Films: తెలుగు సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమాలివే!

2021 Telugu Films

2021 Telugu Films: 2021.. అన్ని ఇండస్ట్రీలను బయపెట్టినా.. టాలీవుడ్ ను నిలబెట్టింది. తెలుగు సినిమా అంటే ఇండియన్ సినిమా అన్న పేరు ఈ ఇయర్ లోనే బలపడింది. కొవిడ్ తో జనం థియేటర్స్ కొస్తారా రారా అన్న అనుమానాల మధ్య.. ఎక్కడాలేని బ్లాక్ బస్టర్స్ మన దగ్గరే సెట్టయ్యాయి. కంటెంట్ ఉంటే ఎప్పుడైనా బంపర్ హిట్ ఇస్తామని తేల్చేసారు మన ఆడియెన్స్. అక్కడక్కడా నెగటివిటీ కనిపించినా.. 2022కి కొత్త జోష్ తో వెల్కమ్ చెప్పారు టాలీవుడ్ స్టార్స్.

Bangarraju: నాగ్ లెక్కే కరెక్ట్ అయింది.. జాక్ పాట్ కొట్టేశాడుగా!

2021.. డిసెంబర్ 31తో కలిపి మొత్తం 225 సినిమాలను తీసుకొచ్చింది. స్ట్రెయిట్ సినిమాలతో పాటూ వీటిలో డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. కొవిడ్ ఎఫెక్ట్ తో ప్రేక్షకులపై అనుమానం ఉన్నా.. థియేటర్స్ కొచ్చి హిట్ కొట్టారు కొందరు మేకర్స్. 2020 లాక్‌డౌన్‌, కొవిడ్ భయం పోయింది ఈ ఏడాది సంక్రాంతితోనే. రవితేజ ‘క్రాక్‌’, రామ్‌ ‘రెడ్‌’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘అల్లుడు అదుర్స్‌’ సంక్రాంతికి ఆట మొదలెట్టాయి. వీటిలో రెడ్ పర్వాలేదనిపించినా క్రాక్‌ రవితేజ్ కు మాసివ్ హిట్ తీసుకొచ్చింది. క్రాక్ తో బాక్సాఫీసుకు పట్టిన వైరస్ ని ఫైర్ చేశాడు మాస్ రాజా.

Telugu Senior Hero’s: తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సీనియర్ హీరోలు!

ఫిబ్రవరిలో రిలీజైన 23 సినిమాల్లో మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ కొట్టింది. అలాగే నాంది చాలా సంవత్సరాల తర్వాత అల్లరి నరేశ్‌ కు సక్సెస్ తెచ్చిపెట్టింది. మార్చిలో 20కు పైగా సినిమాలు హాళ్లకొచ్చినా వాటిలో జాతిరత్నాలు మాత్రమే అసలైన రత్నం అనిపించుకుంది. జాతిరత్నాలు ఫుల్ రన్ లో కోట్ల కలెక్షన్స్ రాబట్టినా.. ఇదేం సినిమా రా బాబూ అనుకున్నవాళ్లూ ఉన్నారు. ఆ తర్వాత శర్వానంద్‌ ‘శ్రీకారం’, శ్రీ విష్ణు ‘గాలి సంపత్‌’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా..’, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’, నితిన్‌ ‘రంగ్‌ దే’ సినిమాలొచ్చినా రంగ్ దే తప్పించి ఏవీ యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేకపోయాయి.

Telugu Star Hero’s: సక్సెస్ కోసం ఎదురుచూపులు.. కోటి ఆశలతో కొత్త ఏడాది!

నిజానికి 2021 సమ్మర్ ని చాలా సినిమాలే టార్గెట్ చేశాయి. కానీ అప్పుడే మళ్లీ కరోనా భయం స్టార్ట్‌ కావడంతో హాళ్లకి పెద్దగా సినిమాలు రాలేదు. ఏప్రిల్‌ నెలలో 12 సినిమాలు థియేటర్స్ కొచ్చినా.. నిలబడింది మాత్రం వకీల్ సాబ్ మాత్రమే. కొవిడ్ సెకండ్ వేవ్ లాక్ డౌన్ ముందు గట్టి వసూళ్లు రాబట్టి టాలీవుడ్ కి వకీల్ సాబ్ తో సూపర్ హిట్ ఇచ్చారు పవర్ స్టార్. పాండెమిక్ టైంలో నెవర్ బిఫోర్ రికార్డ్స్ సాధించి వన్ మ్యాన్ ఆర్మీ అనిపించుకున్నారు పవన్ కల్యాణ్.

Liger: సోషల్ మీడియాను షేక్ చేసిన లైగర్.. అల్ ఇండియా రికార్డ్!

మే, జూన్ నెలల్లో థియేటర్స్ కి లాక్ పడి జూలై చివర్లో మళ్లీ నెమ్మదిగా సినిమా రిలీజ్ లు ప్రారంభమయ్యాయి. ‘తిమ్మరుసు’తో సత్యదేవ్, ‘ఇష్క్‌’తో తేజా సజ్జా ఇనిషియేట్ తీసుకున్నారు. నెక్ట్స్ వచ్చిన సినిమాల్లో ఎస్‌ఆర్‌ కల్యాణమండపం, పాగల్‌, రాజ రాజ చోర, శ్రీదేవి సోడా సెంటర్ కాస్త ఊరటనిచ్చాయి. సినిమాను రెడీ చేసుకొని థియేటర్స్ కి వెళ్లాలా, వద్దా అని మేకర్స్ ఆలోచిస్తున్న టైంలో గోపీచంద్‌ ‘సీటీమార్‌’ రీసౌండ్ చేసింది. నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ దాన్ని కొనసాగించి.. అక్కినేని హీరోకి చాన్నాళ్ల తర్వాత పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొచ్చింది.

RRR Postpone: టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం.. వుయ్ వాంట్ అఫీషియల్ కన్ఫర్మేషన్

ఇక ఫోర్త్ క్వార్టర్ లో చాలా సినిమాలే థియేటర్స్ ని అటాక్ చేశాయి. వీటిలో రిపబ్లిక్, పెళ్లి సందడి, వరుడు కావలెను, పుష్పక విమానం సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చినా.. లాంగ్ రన్ కంటిన్యూ చేయలేక చేతులెత్తేశాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం అఖిల్ కి గుర్తుండిపోయే సక్సెస్ ఇచ్చింది. అయితే టాలీవుడ్ లో అసలైన దడ దడ మొదలైంది మాత్రం బాలయ్య అఖండతోనే. బోయపాటి-బాలకృష్ణ హ్యాట్రిక్ మూవీ అఖండను తీసుకొచ్చి థియేటర్స్ ను దబిడి దిబిడి చేసేశారు. ఈ కొవిడ్ పరిస్థితుల్లో 100 కోట్ల క్లబ్ లో అదీ ఫస్ట్ టైమ్ చేరి ఫ్యాన్స్ కు మర్చిపోలేని ట్రీట్ ఇచ్చాడు బాలయ్య.

Bangarraju : సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’.. వాసివాడి తస్సాదియ్యా ‘బంగార్రాజు’ టీజర్ అదిరిందిగా

అఖండ జోష్ ను డబుల్ చేసేలా దూకుడు చూపించాడు పుష్పరాజ్. పాన్ ఇండియా వైడ్ రిలీజైన ఈ సినిమాతో ఎన్నో రికార్డులు సృష్టించారు ఐకాన్ స్టార్. బన్నీ స్టామినా చూసి మిగిలిన ఇండస్ట్రీలన్నీ ఆశ్చర్యపోతున్నాయంటే అది నిజం. కరోనా సమయంలో రెండు ఓటీటీ రిలీజ్ ల తర్వాత నేరుగా శ్యామ్ సింగ రాయ్ తో థియేటర్స్ కొచ్చిన నాని.. డీసెంట్ హిట్ సొంతం చేసుకున్నాడు. సౌత్ లో నానికున్న ఇమేజ్ ను మరోసారి ప్రూవ్ చేస్తుంది శ్యామ్ సింగ రాయ్. ఇక అర్జున ఫాల్గుణతో పాటూ మరికొన్ని సినిమాలు డిసెంబర్ 31ను కూడా టార్గెట్ చేసి ఆడియెన్స్ ముందుకొచ్చేశాయి.