Thief Arrest: ఎం.ఎన్.వో.ముసుగులో చోరీలు.. పట్టుకున్న పోలీసులు

కడప జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న నకిలీ ఎం.ఎన్.వోను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కడప నగరంలోని శ్రీ రాం నగర్‌కు చెందిన మణిదీప్ కోవిడ్ సమయంలో ఎం.ఎన్.వోగా పనిచేశాడు. అప్పటి అనుభవాన్ని వాడుకుంటూ మణిదీప్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

Thief Arrest: ఎం.ఎన్.వో.ముసుగులో చోరీలు.. పట్టుకున్న పోలీసులు

Thief Arrest

Thief Arrest: కడప జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న నకిలీ ఎం.ఎన్.వోను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కడప నగరంలోని శ్రీ రాం నగర్‌కు చెందిన మణిదీప్ కోవిడ్ సమయంలో ఎం.ఎన్.వోగా పనిచేశాడు. అప్పటి అనుభవాన్ని వాడుకుంటూ మణిదీప్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. నిందితుడిని అరెస్టు చేసిన రిమ్స్ పోలీసులు నగరంలోని జిల్లా కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడు మణిదీప్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ అన్బు రాజన్ మాట్లాడుతూ మణిదీప్ దొంగతనాలకు పాల్పడిన విధానాన్ని వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లా సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులను టార్గెట్ చేసుకుని మణిదీప్ దొంగతనాలు చేసేవాడు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు.

TTD: అమెరికాలో ఈ నెల 18 నుంచి శ్రీవారి కల్యాణోత్సవాలు

మత్తు ఇంజిక్షన్‌లు ఇచ్చి, రోగుల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునే వాడు. ఈ దొంగతనాలపై ఆసుపత్రి స్వీపర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపారు. నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి పది లక్షల రూపాయల విలువ చేసే 22 తులాల ఆభరణాలు, ఒక సెల్‌ఫోన్, రెండున్నర వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మణిదీప్‌పై నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దొంగలను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.