Netflix movies: ఈ సమ్మర్ నెట్‌ఫ్లిక్స్ హంగామా.. వారానికో హాలీవుడ్ సినిమా విడుదల!

ఇక్కడా.. అక్కడా అని లేకుండా దాదాపు ప్రపంచమంతటా కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. ఇందులో కొన్ని దేశాలు కాస్త తగ్గుముఖం పట్టినా ధైర్యంగా కోవిడ్ దరిద్రం పోయిందని ఆ దేశాలలో కూడా నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ జనాభా మొత్తం వినోదం మీద ఆధారపడుతుంది డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ మీదనే.

Netflix movies: ఈ సమ్మర్ నెట్‌ఫ్లిక్స్ హంగామా.. వారానికో హాలీవుడ్ సినిమా విడుదల!

Netflix Movies

Netflix movies: ఇక్కడా.. అక్కడా అని లేకుండా దాదాపు ప్రపంచమంతటా కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. ఇందులో కొన్ని దేశాలు కాస్త తగ్గుముఖం పట్టినా ధైర్యంగా కోవిడ్ దరిద్రం పోయిందని ఆ దేశాలలో కూడా నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ జనాభా మొత్తం వినోదం మీద ఆధారపడుతుంది డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ మీదనే. ఇందులో హాలీవుడ్ నుండి మన టాలీవుడ్ వరకు ఎన్నో ఓటీటీలు.. మరెన్నో సినిమాలు, డ్రామాలు, సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ ఫ్లాట్స్ ఫామ్స్ మీద ఒరిజినల్ కంటెంట్ కు ఎంత డిమాండ్ ఉంటుందో హాలీవుడ్ మూవీస్, సిరీస్ లకు భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సమ్మర్ ను మరింత వినోదభరితం చేసేందుకు సిద్ధమైంది. వారానికో హాలీవుడ్ సినిమాను తన ఫ్లాట్ ఫామ్ మీద విడుదలకు సిద్ధమైంది. వీటిలో జాంబీ యుద్ధం నుండి.. మనసును కదిలించే మానసిక థ్రిల్లర్‌ల వరకు ఎన్నో ఉన్నాయి. వాటిలో..

MAY
1. Monster

Monster

Monster

దర్శకుడు ఆంథోనీ మాండ్లర్స్ తెరకెక్కించిన పర్ఫెక్ట్ సస్పెన్స్ సినిమా మాన్స్టర్. 17 ఏళ్ల స్టీవ్ హార్మోన్ అనే యువకుడి కథ ఈ సినిమా. అతడిపై అత్యాచార, హత్య ఆరోపణలు వచ్చినప్పుడు యువకుడు న్యాయ పోరాటంలో సంక్లిష్టమైన ప్రయాణమే ఈ సినిమా. ఈ చిత్రంలో కెల్విన్ హారిసన్ జూనియర్, జెన్నిఫర్ హడ్సన్, జెఫ్రీ రైట్, జారెల్ జెరోమ్, జెన్నిఫర్ ఎహ్లే, రాకీమ్ మేయర్స్, నాసిర్ ‘నాస్’ జోన్స్, టిమ్ బ్లేక్ నెల్సన్, జాన్ డేవిడ్ వాషింగ్టన్ నటించారు.

విడుదల తేదీ: 7 మే 2021

2. The Woman in the Window

The Woman In The Window

The Woman In The Window

అమీ ఆడమ్స్, గ్యారీ ఓల్డ్‌మన్, ఆంథోనీ మాకీ, ఫ్రెడ్ హెచింగర్, వ్యాట్ రస్సెల్, బ్రియాన్ టైరీ హెన్రీ, జెన్నిఫర్ జాసన్ లీ, జూలియన్నే మూర్ నటించిన The Woman in the Window సినిమా బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్‌. అగోరాఫోబిక్ గల ఓ మహిళ కొత్తగా వచ్చిన పొరుగువారిని భయపెట్టడం మీద నడిచే ఈ సినిమా ఈ సమ్మర్ బెస్ట్ థ్రిల్లర్ గా మిగులుతుందని చిత్ర నిర్మాత, రచయిత జోయ్ చెప్తున్నాడు.

విడుదల తేదీ: 14 మే 2021

3. Army Of The Dead

Army Of The Dead

Army Of The Dead

జాక్ స్నైడర్ రచన, దర్శకత్వంలో తెరకెకెక్కిన ఆర్మీ ఆఫ్ ది డెడ్ సినిమా ఆయన అభిమానులకు ఓ విందుగా కాబోతుందని చెప్పొచ్చు. లాస్ వెగాస్‌ నగరంలో ఓ వైపు జాంబీస్ వ్యాపిస్తుండగా దోపిడీదారుల బృందం భారీ దోపిడీనీ ప్లాన్ చేస్తుంది. దీని నుండి ప్రజలను నగరాన్ని ఎలా కాపాడారన్నదే సినిమా కథ.

విడుదల తేదీ: 21 మే 2021

4. Baggio: The Divine Ponytail

Baggio

Baggio

స్పోర్ట్స్ డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ సినిమా బెస్ట్ సాకర్ ఆటగాళ్ళ కథను చెబుతుంది. రాబర్టో బాగియో అనే సాకర్ ఛాంపియన్ అతను కెరీర్లో పెరుగుతున్నప్పుడు అతని అల్పాలు, విజయాలు, బౌద్ధమతం ఆవిష్కరణను ఈ సినిమాలో చూపించనున్నారు.

విడుదల తేదీ: 26 మే 2021

JUNE
5. Vivo

Vivo

Vivo

ఈ వేసవిలో నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయబోయే ఐదు యానిమేటెడ్ ఫీచర్లలో వివో కూడా ఒకటి. సోనీ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ యానిమేషన్ మూవీలో లిన్-మాన్యువల్ మిరాండా అనే నూతన దర్శకుడి చేత సంగీతాన్ని అందించనున్నారు.

విడుదల తేదీ: 3 జూన్ 2021

6. Awake

Awake

Awake

నెట్‌ఫ్లిక్స్ అందించే ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో మంచి కథాంశం ఉంది. ఓ సైనికుడి కుమార్తె తెలుసుకున్న ఒక కీలకమైన టెక్నాలజీ సమస్య నుండి ప్రపంచాన్ని ఎలా కాపాడారన్నదే సినిమా కథ. టెక్నాలజీ అనే గ్లోబల్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సైనికుడి కుమార్తె ప్రపంచాన్ని కాపాడటానికి ముందు ఆమె తన కుటుంబాన్ని కాపాడుకుంటుందా లేదా త్యాగం చేస్తుందా? అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది.

విడుదల తేదీ: 9 జూన్ 2021

7. Skater Girl

Skater Girl

Skater Girl

భారతదేశంలోని ఓ మారు మూల గ్రామానికి చెందిన ఓ బాలిక స్కేట్‌బోర్డింగ్ ఛాంపియన్ గా ఎలా మారిందన్నదే ఈ సినిమా కథ. స్కేట్‌బోర్డింగ్ పట్ల మక్కువ, ప్రతిభ, కృషితో ఆమె జాతీయ ఛాంపియన్‌షిప్‌లోకి ప్రవేశిస్తుంది. ఆమె అక్కడికి ఎలా చేరుకుంది అనే కథ ఇది.

విడుదల తేదీ: 11 జూన్ 2021

8. Fatherhood

Fatherhood

Fatherhood

కెవిన్ హార్ట్, ఆల్ఫ్రే వుడార్డ్, లిల్ రిల్ హౌరీ, దేవాండా వైజ్, ఆంథోనీ కారిగాన్, మెలోడీ హర్డ్ మరియు పాల్ రైజర్ నటించిన ఈ చిత్రం అందమైన, హృదయాన్ని హత్తుకొనే కథ. ప్రపంచంలోనే కష్టతరమైన ఉద్యోగం తండ్రి. దాన్ని అతడు ఎలా నిర్వర్తించాడన్నదే కథ.

విడుదల తేదీ: 18 జూన్ 2021

9. Good on Paper

Good On Paper

Good On Paper

ఓ స్టాండప్ కమెడియన్ తనకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని కలుస్తాడు. కానీ అతను తన వ్యక్తిత్వానికి తగ్గట్లు ఉన్నాడా లేదా అన్నదే ఈ సినిమా కథ. ఇలిజా షెల్సింగర్, రియాన్ హాన్సెన్, మార్గరెట్ చో, రెబెకా రిటెన్‌హౌస్, మాట్ మెక్‌గౌరీ, టైలర్ కామెరాన్, టేలర్ హిల్ నటించిన ఈ సినిమాకు కిమ్మీ గేట్‌వుడ్ దర్శకత్వం వహించారు.

విడుదల తేదీ: 23 జూన్ 2021

10. America: The Motion Picture

America The Motion Picture

America The Motion Picture

చానింగ్ టాటమ్, జాసన్ మాంట్జౌకాస్, ఒలివియా మున్, బాబీ మొయినిహాన్, జూడీ గ్రీర్, విల్ ఫోర్టే, రౌల్ మాక్స్ ట్రుజిల్లో, కిల్లర్ మైక్, సైమన్ పెగ్, ఆండీ శాండ్‌బర్గ్ ఈ అమెరికాలో కలిసి నటించారు. అమెరికన్ విప్లవానికి యానిమేటెడ్ కామెడీ కలిపి మోషన్ పిక్చర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

విడుదల తేదీ: ప్రకటించాలి

JULY
11. Resort to Love

Resort To Love

Resort To Love

క్రిస్టినా మిలియన్, జే ఫరోహ్, సిన్క్వా వాల్స్, క్రిస్టియాని పిట్స్, కరెన్ ఓబ్లియోమ్, అలెగ్జాండర్ హాడ్జ్, టిజె పవర్, సిల్వైన్ స్ట్రైక్, జెరిల్ ప్రెస్కోట్, టైంబర్లీ హిల్ కలిసి నటించిన ఈ సినిమాలో పాప్ స్టార్ ఎరికా ప్రత్యేక ఆకర్షణ. ఇందులో ఆమె తన మాజీ వివాహం అంశాన్ని తెరమీదకి తీసుకురాగా.. ఆమెకు మాజీ భర్త పట్ల ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయని తెలపనుంది.

విడుదల తేదీ: 29 జూలై 2021

12. The Last Mercenary (Le Dernier Mercenaire)

The Last Mercenary

The Last Mercenary

డేవిడ్ చార్హోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జీన్-క్లాడ్ వాన్ డామ్మే, ఎరిక్ జూడోర్, మియో-మియు, పాట్రిక్ టిమ్సిట్ నటించారు. యాక్షన్-కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఓ మాజీ రహస్య సేవా ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. అతను తన కుమారుడు ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు అత్యవసరంగా ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లిపోగా దాని నుండి ఎలా బయటపడ్డారన్నదే కథ.

విడుదల తేదీ: 30 జూలై 2021

13. The Last Letter From Your Lover

The Last Letter From Your Lover

The Last Letter From Your Lover

జాయో మోయెస్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా ది లాస్ట్ లెటర్ ఫ్రమ్ యువర్ లవర్ సినిమా తెరకెక్కింది. అగస్టిన్ ఫ్రిజ్జెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫెలిసిటీ జోన్స్, షైలీన్ వుడ్లీ, కల్లమ్ టర్నర్, నభాన్ రిజ్వాన్, జో అల్విన్, న్కుటి గాట్వా ఉన్నారు. విహారయాత్రకు వెళ్లి, విషాదకరమైన పరిణామాలతో హింసాత్మక కుట్రలో ఇరుక్కున్న జంట దాని నుండి ఎలా బయటపడ్డారన్నదే కథ.

విడుదల తేదీ: ఆగస్టు 2021

August
14. The Kissing Booth 3

the kissing booth 3

the kissing booth 3

నెట్‌ఫ్లిక్స్ నుండి వస్తున్న సిరీస్ లలో ది కిస్సింగ్ బూత్ కూడా ఒకటి. ఇది మూడవ భాగమే కాకుండా ఇదే చివరిది కూడా. కిస్సింగ్ బూత్ 3 ఎల్లేను మరింతగా హైలెట్ చేయడమే కాకుండా ఆమె హార్వర్డ్‌లో ఉన్న తన ప్రియుడు నోహ్‌, బర్కిలీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ లీ.. ఎవరితో కలుస్తుందనే ఉత్కంఠను కలిగిస్తుంది.

విడుదల తేదీ: 11 ఆగస్టు 2021

15. Sweet Girl

Sweet Girl

Sweet Girl

జాసన్ మోమోవా, ఇసాబెలా మెర్సిడ్, మాన్యువల్ గార్సియా-రుల్ఫో, అడ్రియా అర్జోనా, రాజా జాఫ్రీ నటించిన ఈ సినిమాలో భార్య మరణానికి కారణమైన వారికి శిక్ష పడాలని, తన కుమార్తెను రక్షించుకోవాలని కోరుకొనే ఓ వ్యక్తి జీవితమే కథాంశం.

విడుదల తేదీ: 20 ఆగస్టు 2021

16. Beckett

Beckett

Beckett

విహారయాత్రకు వెళ్లి, విషాదకరమైన పరిణామాలతో హింసాత్మక కుట్రలో పడే జంట ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నదే ఈ సినిమా కథ. ఈ చిత్రంలో జాన్ డేవిడ్ వాషింగ్టన్, అలిసియా వికాండర్, బోయ్డ్ హోల్‌బ్రూక్, విక్కీ క్రిప్స్ నటించారు

విడుదల తేదీ: ఆగస్టు 2021

17. Fear Street Trilogy

Fear Street Trilogy

Fear Street Trilogy

Fear Street Trilogy 1994లో ఓహియో పట్టణంలో జరిగిన భయానక సంఘటనల గురించి ఓ టీనేజర్ల టీం పరిశోధనే ఈ సినిమా కథాంశం. లీ జానియాక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గిలియన్ జాకబ్స్, కియానా మదీరా, ఒలివియా వెల్చ్, డారెల్ బ్రిట్-గిబ్సన్, ఎమిలీ రూడ్, ఆష్లే జుకర్మాన్, ఫ్రెడ్ హెచింగర్, బెంజమిన్ ఫ్లోర్స్ జూనియర్, జూలియా రెహ్వాల్డ్ మరియు జెరెమీ ఫోర్డ్ నటించారు.

విడుదల తేదీ: ఇంకా ప్రకటించలేదు