Cholesterol : ఆ పండ్లు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయ్….

యాపిల్స్ ను రోజువారిగా తీసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు కూడా వెళ్ళాల్సిన పనికూడా ఉండదంటారు.

Cholesterol : ఆ పండ్లు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయ్….

Fruits

Cholesterol : ప్రస్తుత పరిస్ధితిల్లో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని తగ్గించుకోవటం వారికి పెద్ద సవాల్ గా మారింది. మనం తినే ఆహారపు అలవాట్లను కంట్రోల్ చేసుకోవాలి. కొవ్వును తగ్గించుకోవాలని చూస్తున్న వారు కేవలం శరీర వ్యాయామాల మీద మాత్రమే దృష్టి పెడితే సరిపోదు. మనం తినే ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తినే ఆహార పదార్థాలు కూడా మన శరీరంలో ఉండే కొవ్వును ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా సమయ పాలన ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఊబకాయం బారిన పడుతుంటారు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరిగిన కొలెస్ట్రాల్ తగ్గించాలంటే వ్యాయామానికి తోడుగా కొన్ని రకాల పండ్లను రోజు వారిగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆ వివరాలేంటో చూద్దాం…

ద్రాక్ష; కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో ద్రాక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. రుచికరమైన ఈ పండ్లను రోజు వారిగా కొద్ది మొత్తంలో తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గేందుకు ఇవి దోహదం చేస్తాయి. అంతే కాదు కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గిచటంలో ఉపకరిస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.

యాపిల్స్ ; యాపిల్స్ ను రోజువారిగా తీసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు కూడా వెళ్ళాల్సిన పనికూడా ఉండదంటారు. వీటిలో ఉండే పెక్టిన్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫైబర్ కూడా తగిన మోతాదులో ఉంటుంది కాబట్టి జీవక్రియలు మెరుగుపడేలా చేస్తుంది.

స్ట్రాబెర్రీలు ; స్ట్రాబెర్రీలు రుచికి బాగా ఉంటాయి. తియ్యగా ఉన్న స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో చర్మం సౌందర్యవంతంగా మారుతుంది. అన్ని వయస్సుల వారు వీటిని తీసుకోవచ్చు.

అవోకాడో ; కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటే అవొకాడో తినడం వల్ల సమస్యను పోగొట్టుకోవచ్చు. వీటిని ఆహారంలో బాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. అవకాడోలో కొవ్వులు తక్కవగా ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది.

వీటితోపాటు నారింజ, నిమ్మ, వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో దోహదపడతాయి. ఇందులో సీ విటమిన్ అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు.