Body Heat : శరీరంలో వేడిని తగ్గించే చిట్కాలు…

మెంతులను వేయించి, పొడిచేసి గోరువెచ్చటి నీటితో కలిపి తాగడం ద్వారా కూడా వేడిని తగ్గించుకోవచ్చు. రోజూ రెండు కప్పులు తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.

Body Heat : శరీరంలో వేడిని తగ్గించే చిట్కాలు…

Reduce Body Heat ...

Body Heat : శరీరంలో డీ హైడ్రేషన్ కు గురైన సందర్భంలో శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. దీంతో శరీరం అలసి పోవటం, నీరసం అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయంలో అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇలాంటి సందర్భంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సులభంగా ఆపరిస్ధితి నుండి బయటపడవచ్చు. వేడిని తగ్గించే చిన్న చిన్న చిట్కాలు మీకోసం…

ప్రతి రోజూ నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరం చల్లబడుతుంది. అలాగే క్రమం తప్పకుండా ఎర్ర మందారం టీ తాగడంవల్ల కూడా శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. సోంపు, జీలకర్ర, ధనియాలు రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు తాగడంవల్ల కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది. దానిమ్మ గింజల్లో శరీరంలో వేడిని తగ్గించే లక్షణం ఉంది. రెండుమూడు రోజులకు ఒకసారి దానిమ్మ రసం తాగడంవల్ల శరీరం చల్లగా ఉంటుంది.ఒక టీ స్పూన్ కరక్కాయ పొడికి, అరటీ స్పూన్ చక్కెర కలపి ఉదయం పూట పరగడుపునే తింటే శరీరంలో వేడి తగ్గిపోతుంది. విటమిన్ సి అధికంగా ఉండే పంట్లను ఎక్కువగా తీసుకున్నా శరీరంలో ఉండే తగ్గుతుంది. శరీరంలో వేడి ఎక్కువైన సందర్భంలో చల్లటి నీరు తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పుచ్చకాయ తినటం వల్ల కూడా వేడి తగ్గుతుంది. గోరు వెచ్చని పాలల్లో తేనె కలుపుకుని రోజు తాగితే వేడి నుండి ఉపశమనం పొందవచ్చు.

మెంతులను వేయించి, పొడిచేసి గోరువెచ్చటి నీటితో కలిపి తాగడం ద్వారా కూడా వేడిని తగ్గించుకోవచ్చు. రోజూ రెండు కప్పులు తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. రోజూ ఉదయం కొబ్బరి నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెతో శరీరానికి మర్ధన చేసుకుని స్నానం చేయడంవల్ల కూడా శరీరం చల్లబడుతుంది. శరీరంలో వేడిని పొగొట్టేందుకు దోసకాయ ప్రయోజనకారిగా చెప్పవచ్చు. దోసకాయల్లో అధికంగా నీరు ఉండటం వల్ల శరీరాన్ని చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంది. పచ్చి దోసకాయ ముక్కలను తీసుకున్నా లేకుంటే కూరగా తీసుకున్నా మంచిదే. శరీర వేడిని తగ్గించటంలో పుదీనా బాగా పనిచేస్తుంది. పుదీనా ఆకుల రసాన్ని తాగినా శరీరంలో చల్లబడుతుంది. శరీరాన్ని చలబరిచే గుణాన్ని గసగసాలు కలిగి ఉన్నాయి. ప్రతి ఇంటి పోపుల పెట్టేలో గసగసాలు అందుబాటులోనే ఉంటాయి. గసగసాలను కొద్ది మొత్తంలో తీసుకుని తిన్నా చాలు మంచి ఫలితం ఉంటుంది.

పెరుగులో కొంచెం తేనె కలుపుకుని తీసుకుంటే వేడి నుండి విముక్తి లభిస్తుంది. దీంతో పాటు శరీరం వేడి కారణంగా ఉత్పన్నమైన సమస్యల నుండి రక్షించబడుతుంది. వేడిచేసే ఆహార పదార్దాలైన పుల్లటి పండ్లు, జీట్‌రూట్‌లు, క్యారెట్‌లను వేసవిలో ఎక్కువగా తినకుండా ఉండటమే శ్రేయస్కరం.