Fake Vaccine: ఎంపీనే బురిడీ కొట్టించిన నకిలీ ఐఏఎస్!

ఒకవైపు కరోనా థర్డ్ వేవ్ భయం.. ఇప్పటికే మన దేశంలో భయపెడుతున్న డెల్టా వేరియంట్ తో వ్యాక్సిన్ ఒక్కటే పరమావధిగా ప్రభుత్వాలు తొందరపడుతున్నాయి. అయితే.. అక్కడక్కడా ఫేక్ వ్యాక్సిన్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలు కమ్యూనిటీలు, కాలనీలలో ఇలా ఫేక్ వ్యాక్సిన్ డ్రైవ్ లు నిర్వహించగా తాజాగా ఏకంగా ఓ ఎంపీనే మోసపోయారు.

Fake Vaccine: ఎంపీనే బురిడీ కొట్టించిన నకిలీ ఐఏఎస్!

Fake Vaccine

Fake Vaccine: ఒకవైపు కరోనా థర్డ్ వేవ్ భయం.. ఇప్పటికే మన దేశంలో భయపెడుతున్న డెల్టా వేరియంట్ తో వ్యాక్సిన్ ఒక్కటే పరమావధిగా ప్రభుత్వాలు తొందరపడుతున్నాయి. అయితే.. అక్కడక్కడా ఫేక్ వ్యాక్సిన్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలు కమ్యూనిటీలు, కాలనీలలో ఇలా ఫేక్ వ్యాక్సిన్ డ్రైవ్ లు నిర్వహించగా తాజాగా ఏకంగా ఓ ఎంపీనే మోసపోయారు. ఓ నకిలీ ఐఏఎస్ నకిలీ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టి.. ఆ కార్యక్రమానికి ఏకంగా ఎంపీనే అతిధిగా ఎంచుకోవడం విస్తుపోయేలా చేస్తుంది.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కోల్ కతాకి దగ్గరలో కాస్బా ప్రాంతంలో ఈ ఫేక్ ఐఏఎస్ బాగోతం బయటపడింది. కోల్ కతా కార్పొరేషన్ జాయింట్ కమిషనర్ నని చెప్పిన దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి కాస్బా ప్రాంతంలో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టామని.. ఆ కార్యక్రమానికి అతిధిగా రావాలని టీఎంసి ఎంపీ మిమి చక్రవర్తిని కలిశాడు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావడంతో ఎంపీ కూడా సరేనని కార్యక్రమంలో పాల్గొని టీకా కూడా తీసుకున్నారు. అయితే.. టీకా తీసుకున్నా ఫోన్ కు సమాచారం రాలేదు. సర్టిఫికెట్ అడిగితే పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో అనుమానించిన ఎంపీ అనుచరులతో విచారణ చేయించారు.

దీంతో అంతో ఫేక్ ఐఎస్ఎస్ అధికారి కాగా కొద్దిరోజుల క్రితం సోనార్ పూర్ లో ఆటో డ్రైవర్ల కోసం ఇలానే ఫేక్ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారని తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు ఏ ఉద్దేశ్యంతో ఇలా డ్రైవ్ చేపడుతున్నాడోనని దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా ఎంపీనే బురిడీ కొట్టించిన ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కాగా.. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టే వెళ్లి వ్యాక్సిన్ కూడా తీసుకున్నానని.. కానీ ఇలాంటి ప్రభుద్దులు కూడా ఉంటారని అనుకోలేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.