All The Best : అడుగు దూరంలో, సింధు మ్యాచ్‌‌పై ఉత్కంఠ

శనివారం మధ్యాహ్నం సెమీస్‌లో.. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ షెట్లర్‌ తాయ్‌ జు యింగ్‌తో తలపడనుంది సింధు. ప్రస్థుతానికి గోల్డ్‌ మెడల్‌ ఫేవరెట్‌గా ఉన్న తాయ్‌ జు యింగ్‌ను ఓడిస్తే సింధుకు గోల్డ్‌ మెడల్‌ గ్యారెంటీ. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2016లో జరిగిన ఒలింపిక్స్ మ్యాచ్‌లో.. తాయ్‌ జు యింగ్‌ను సింధు మట్టికరిపించింది.

All The Best : అడుగు దూరంలో, సింధు మ్యాచ్‌‌పై ఉత్కంఠ

Sindhu

Updated On : July 31, 2021 / 7:53 AM IST

Tokyo Olympics 2020 Pv Sindhu : టోక్యోలో భారత స్టార్‌ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఒలింపిక్స్‌లో ఈ సారి స్వర్ణ పతకమే లక్ష్యంగా జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది సింధు. క్వార్టర్ ఫైనల్‌లో ఐదో ర్యాంకర్‌ జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై వరుస సెట్లలో గెలిచి మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. 1 -13, 22-20 తేడాతో విజయకేతనం ఎగురవేసి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. సొంతగడ్డపైనే యమగూచిపై విజయం సాధించి బంగారు పతకం దిశగా మరో అడుగు ముందుకేసింది.

Read More : Covid Recovery: కరోనా నుంచి కోలుకున్నాక కనిపించే దీర్ఘకాలిక 5 లక్షణాలు ఇవే..!

2021, జూలై 31వ తేదీ శనివారం మధ్యాహ్నం సెమీస్‌లో.. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ షెట్లర్‌ తాయ్‌ జు యింగ్‌తో తలపడనుంది సింధు. ప్రస్థుతానికి గోల్డ్‌ మెడల్‌ ఫేవరెట్‌గా ఉన్న తాయ్‌ జు యింగ్‌ను ఓడిస్తే సింధుకు గోల్డ్‌ మెడల్‌ గ్యారెంటీ. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2016లో జరిగిన ఒలింపిక్స్ మ్యాచ్‌లో.. తాయ్‌ జుయింగ్‌ను సింధు మట్టికరిపించింది. కానీ ఈ ఐదేళ్లలో తాయ్‌ ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా ఎదిగింది. సింధు, తాయ్‌ ఇప్పటివరకు 18సార్లు తలపడగా.. తాయ్‌ ఏకంగా 13సార్లు విక్టరీ కొట్టింది. కానీ ఒలింపిక్స్‌లో మాత్రం సింధు తాయ్‌పై చెలరేగిపోయి ఆమెను ఓడించింది. ఈ ఒలింపిక్స్‌లో కూడా సింధు అదే స్పీడ్‌తో ఆడి మెడల్‌ గెలుచుకోవాలని కోరుకుంటున్నారు ఇండియన్స్‌.