Covid Recovery: కరోనా నుంచి కోలుకున్నాక కనిపించే దీర్ఘకాలిక 5 తీవ్ర లక్షణాలు ఇవే..!

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా దీర్ఘకాలికంగా వైరస్ లక్షణాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోమోర్బిడిటీల్లోనే ఎక్కువగా ప్రమాదం ఉంటోంది. సెకండ్ వేవ్ కొవిడ్ లక్షణాల తీవ్రత కారణంగా కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

Covid Recovery: కరోనా నుంచి కోలుకున్నాక కనిపించే దీర్ఘకాలిక 5 తీవ్ర లక్షణాలు ఇవే..!

Coronavirus Recovery 5 Symptoms Of Covid 19

Coronavirus recovery: కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా దీర్ఘకాలికంగా వైరస్ లక్షణాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోమోర్బిడిటీల్లోనే ఎక్కువగా ప్రమాదం ఉంటోంది. సెకండ్ వేవ్ కొవిడ్ లక్షణాల తీవ్రత కారణంగా కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఊపిరితిత్తులు దెబ్బతినడం ద్వారా నిరంతర అలసటగా అనిపిస్తుంటుంది. యువకుల్లో కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ కోలుకోవడానికి దీర్ఘకాలిక సమయం పడుతోంది. కరోనా సెకండ్ వేవ్, ఇప్పుడు డెల్టా వేరియంట్ వ్యాప్తితో కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వైరస్ ప్రభావ లక్షణాలు మాత్రం దీర్ఘకాలికంగా వేదిస్తూనే ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

1. శ్వాస తీసుకోలేకపోవడం :
కరోనాతో బాధపడేవారిలో ఎక్కువగా కనిపించే సాధారణ లక్షణం.. శ్వాస తీసుకోలేకపోవడం.. కొన్ని సందర్భాల్లో ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంటుంది. అప్పటివరకూ వెంటిలేటర్ల వంటి వాటిపై ఆధారపడాల్సి వస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా డెల్టా వేరియంట్ కారణంగా అధిక స్థాయిలో ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. సాధారణ స్థితికి రావాలంటే ఆక్సిజన్ సపోర్టు తీసుకోవడం లేదా బ్రీతింగ్ ఎక్సర్ సైజులు వంటి చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు.

2. తీవ్ర అలసట :
కరోనా ప్రారంభ లక్షణాలు ఎక్కువగా కనిపించే లక్షణం ఇది.. ప్రత్యేకించి డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు తీవ్ర అలసటగా అనిపిస్తుంది. ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్నాక కూడా కొన్నివారాల పాటు తీవ్ర అలసట కొనసాగుతూనే ఉంటుంది. వైరస్ కారణంగా శరీరంలో యాంటీబాడీలు తయారైనప్పటికీ అలసట మాత్రం అలానే ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ కూడా సైకోటోన్లను జనరేట్ చేస్తుంది. తద్వారా శరీరంలో అలసట వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అలసట అనేది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్.. విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ముఖ్యంగా శరీరాన్ని హైడ్రేడ్ గా ఉండేలా చూసుకోవాలి. సాధారణ జీవితంలోకి రావాలంటే కొంత సమయం పడుతుంది. అప్పుడు వరకు విశ్రాంతి చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

3. గొంతులో మంట.. బొంగురుగా మారడం :
కరోనాతో పోరాడే వారిలో ఎక్కువగా కనిపించే లక్షణం గొంతులో మంట.. వాయిస్ మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఎగువ శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో గొంతులో మార్పు ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిరంతర దగ్గు, గొంతులో మంటగా అనిపించడం వంటి సమస్యలు ఉంటాయి. సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. గొంతులో మార్పుల కారణంగా వాయిస్ కూడా బొంగురుగా అనిపిస్తుంది. కొన్ని అధ్యయనాల్లో వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కరోనా నుంచి కోలుకున్నాక కూడా సాధారణ స్థితికి చేరుకోవడానికి దీర్ఘకాలిక సమయం పడుతుంది.

4. ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ :
కోవిడ్ నుంచి కోలుకున్నాక ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ దీర్ఘకాలిక లక్షణాలలో కొత్తగా చేరింది. డెల్టా వేరియంట్‌లో కూడా ఈ తరహా లక్షణం తీవ్రంగా ఉంటుంది. తద్వారా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇన్‌ఫెక్షన్ తీవ్రతను బట్టి.. కొన్నిసార్లు, శ్వాసకోశ సమస్యల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. తీవ్రమైన ఊపిరితిత్తుల పైబ్రోసిస్ నుంచి మందులు, ట్రీట్ మెంట్ ద్వారా కొంతవరకు రిలీఫ్ పొందవచ్చు. కరోనా నుంచి కోలుకున్నాక ఫైబ్రోసిస్ దీర్ఘకాలిక లక్షణాలలో ఒకటిగా చెబుతున్నారు.

5. ఒళ్లు నొప్పులు :
కరోనా ఇన్ఫెక్షన్ బాధితుల్లో ఎక్కువగా కనిపించే మరో సాధారణ లక్షణం.. ఒళ్లు నొప్పులు.. కండరాల నొప్పులు.. కరోనా బాధితుల్లో ఈ సమస్య దీర్ఘకాలికంగా కూడా వేధించవచ్చు. సైకోటోన్ల వల్ల ఈ సమస్య ఎదురుకావచ్చు. కరోనా నుంచి కోలుకున్నా చాలామందిలో ఈ సమస్య అధికంగా ఉన్నట్టు చెబుతున్నారు. అవసరమైన మందులు, చికిత్సతో పాటు విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ దీర్ఘకాలిక లక్షణాలు ఎక్కువకాలం ఉంటే మాత్రం వైద్య సాయం తీసుకోవాలి. లేదంటే మీ అవయవాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడొచ్చు. ఆస్పత్రిలో చేరి కోలుకున్న అనంతరం వారిలోనూ వైరస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వైద్యులు లక్షణాల తీవ్రతను పర్యవేక్షించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తారు. వ్యాక్సిన్ సరైన సమయంలో తీసుకోవడం ద్వారా కూడా దీర్ఘకాలిక లక్షణాలను తొందరగా తగ్గించుకోవచ్చు.