Tom Cruise : టామ్ క్రూజ్‌కు పాజిటివ్.. ఐసోలేషన్‌లో ‘మిషన్ ఇంపాజిబుల్’ టీమ్..

యూనిట్‌లో ఎవ్వరూ కోవిడ్ బారిన పడకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్న హీరో టామ్ క్రూజ్ ఇప్పుడు తనే డేంజర్‌లో పడ్డారు..

Tom Cruise : టామ్ క్రూజ్‌కు పాజిటివ్.. ఐసోలేషన్‌లో ‘మిషన్ ఇంపాజిబుల్’ టీమ్..

Tom Cruise

Tom Cruise: లాక్‌డౌన్ తర్వాత సూపర్ ఫాస్ట్‌గా చేస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్’ టీమ్‌కి కరోనా మరో సారి బ్రేక్ వేసింది. తన యూనిట్‌లో ఎవ్వరూ కోవిడ్ బారిన పడకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్న హీరో టామ్ క్రూజ్ ఇప్పుడు తనే డేంజర్‌లో పడ్డారు..

స్వీట్ సిక్స్‌టీ ఇయర్స్‌కి దగ్గరవుతున్న టామ్ క్రూజ్, ‘మిషన్ ఇంపాజిబుల్’ షూట్‌లో బిజీగా ఉన్నారు. హాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది టామ్ క్రూజ్‌కి. ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌లో 7,8 సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ తెరకెక్కిద్దామని ప్లాన్ చేసుకున్నారు డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్ క్వారీ. అందుకే సెవెన్‌కి సంబంధించి లాక్‌డౌన్ తర్వాత టామ్ క్రూజ్ షూటింగ్ స్టార్ట్ చేసి స్పీడ్‌గా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ షూట్‌కి మరోసారి బ్రేక్ వేసింది కోవిడ్.

పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ కు సంబంధించి షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్‌లో 10 మందికి పైగా కరోనా బారిన పడడంతో షూటింగ్‌కి వెంటనే ప్యాకప్ చెప్పేశారు టీమ్. అంతే కాదు, టీమ్‌తో పాటు హీరో టామ్ క్రూజ్ కూడా కోవిడ్‌కి ఎటాక్ అయ్యారన్న టాక్ హాలీవుడ్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్..

టామ్ క్రూజ్‌కి కూడా కరోనా వచ్చిందని, లేదు.. యూనిట్‌లో 10 మందికి మాత్రమే కరోనా వచ్చిందని, టామ్ జస్ట్ ముందుజాగ్రత్తగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో మాత్రమే ఉన్నారని జూన్ 14 నుంచి షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు ప్రొడ్యూసర్లు. 2021 జూన్ 23 న రిలీజ్ అవ్వాల్సి ఉన్న ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ మూవీ కరోనా ఎఫెక్ట్‌తో ఈ సంవత్సరం నవంబర్‌కి పోస్ట్ పోన్ అయ్యింది. ఆ టైమ్‌కి కూడా రిలీజ్ సాధ్యం కాదని నెక్ట్స్ ఇయర్ మే కి పోస్ట్ పోన్ అయ్యింది..