New Smartphones in 2022: జనవరి 2022లో వస్తున్న 5 టాప్ స్మార్ట్ ఫోన్స్

2022 నూతన సంవత్సరం ఆరంభం నుంచే వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు.

New Smartphones in 2022: జనవరి 2022లో వస్తున్న 5 టాప్ స్మార్ట్ ఫోన్స్

Phones

New Smartphones in 2022: 2022 నూతన సంవత్సరం ఆరంభం నుంచే వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు. ప్రధానంగా చైనా ఫోన్ సంస్థలు కొత్త సంవత్సరం మొదటి నెలలోనే కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. Oneplus, Xiaomi, Realme, oppo, infinix సంస్థలు సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ని భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా మోడల్స్ ని ఆవిష్కరించిన సంస్థలు, వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేలా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ సంస్థల నుండి వస్తున్న ఆ కొత్త మోడల్స్ ఏంటంటే..

Xiaomi 11i, Xiaomi 11i HyperCharge: చైనా ఫోన్ దిగ్గజం షియోమీ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ని విడుదల చేస్తుంది. Xiaomi 11i ఫోన్ లో అధిక కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉండగా, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ తో Xiaomi 11i HyperCharge వేరియంట్ ప్రత్యేకత చాటుకుంది. ఇక ఈ రెండు ఫోన్లు 6.67 అంగుళాల FullHD+ డిస్ప్లేతో వస్తున్నాయి. ఈ రెండు ఫోన్ లలో బ్యాటరీ మినహా మిగతా ఫీచర్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. జనవరి మొదటి/రెండో వారాల్లో ఈ ఫోన్స్ రానున్నాయి.

Also Read: Upcoming Web-Series: ఓటీటీల్లో త్వరలో రానున్న వెబ్ సిరీస్ లు

Infinix Zero 5G: బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ తయారీదారు Infinix నుంచి వస్తున్న ప్రీమియం ఫోన్ infinix Zero 5G. ఇప్పటికే బడ్జెట్ సెగ్మెంట్లో ఈ సంస్థ నుంచి వచ్చిన ఫోన్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సంస్థ 5G ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ప్రీమియం ఫోన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా Zero 5G ఫీచర్స్ ఉండనున్నాయి. 6.67 అంగుళాల AMOLED FullHD+ తెర, 8GB RAM, 128GB స్టోరేజ్, 108MP ట్రిపుల్ కెమెరా సిస్టంతో ఈ infinix Zero 5G రానుంది.
Realme GT 2 Pro Master Edition: శాంసంగ్, యాపిల్, షియోమీ మార్కెట్ ను తనవైపు తిప్పుకోవాలని భావిస్తున్న Realme సంస్థ..ఆ దిశగా అడుగులు వేస్తుంది. ప్రీమియం ఫోన్స్ కి ధీటుగా స్మార్ట్ ఫోన్స్ ను తీసుకువచ్చింది. ఇక 2022లో Realme నుంచి వస్తున్న స్మార్ట్ ఫోన్ GT 2 Pro Master Edition. స్నాప్‌డ్రాగన్ 778G 5G ప్రాసెసర్, 120Hz AMOLED స్క్రీన్, 65W సూపర్‌డార్ట్ ఛార్జ్ వంటి పవర్ ప్యాకెడ్ ఫీచర్స్ తో ఈ ఫోన్ వస్తుంది. ఇప్పటికే సంస్థ వెబ్ సైట్ లో ఫోన్ బుకింగ్ ప్రారంభమయ్యాయి.

Also read: I-T raids on Xiaomi, Oppo: షియోమీ, ఒప్పో కంపెనీలపై రూ.1000 కోట్ల జరిమానా విధించే అవకాశం

Vivo V23 series: చైనాకు చెందిన మరో స్మార్ట్ ఫోన్ దిగ్గజం ViVo 2022 నూతన సంవత్సరాన్ని ఒక కొత్త సిరీస్ తో ప్రారంభించనుంది. V23 సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్స్ ని వివో విడుదల చేస్తుంది. ఇప్పటికే చైనాలో అమ్మకాలు ప్రారంభమవగా.. జనవరి నుంచి భారత్ లోనూ V23 సిరీస్ ఫోన్ అమ్మకాలు మొదలౌతాయి. ఇండియాలోనే మొదటిసారి 3D కర్వ్ డిస్ప్లే, 7.36mm స్లిమ్ బాడీ వంటి ఫీచర్స్ ఈ ఫోన్స్ లో ఉన్నాయి. V23 5G, V23 Pro 5Gగా వస్తున్న ఈ రెండు స్మార్ట్ ఫోన్స్, ప్రీమియం యూజర్లను టార్గెట్ గా చేసుకుని మార్కెట్లోకి రానున్నాయి.

OnePlus 10 Pro: ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ లలో వినియోగదారులను ఆకట్టుకుంటున్న మరో టాప్ ఫోన్ బ్రాండ్ OnePlus. ఈ సంస్థ నుంచి 2022లో హై ఎండ్ స్మార్ట్ ఫోన్ రానుంది. OnePlus 10 Pro గా వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లో అన్ని కొత్త ఫీచర్స్ ఉండనున్నాయి. క్వాల్కమ్ సంస్థ అభివృద్ధి చేసిన Snapdragon 8 Gen1 హై ఎండ్ ప్రాసెసర్ తో వస్తున్న మొట్టమొదటి ఫోన్ ఇది. 6.7అంగుళాల LPTO QHD+ AMOLED స్క్రీన్, 12GB LPDDR5 ర్యామ్ వంటి అధునాతన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
ఇవి 2022 కొత్త ఏడాది మొదటి నెలలోనే భారత్ లో విడుదల కానున్న టాప్ స్మార్ట్ ఫోన్స్

Also Read: Google Pixel 6 : పిక్సెల్ 6 ఫోన్లలో Update 2021‌తో కాల్ డ్రాప్ ఇష్యూ.. అప్‌డేట్ ఆపేసిన గూగుల్