Youth rescued by IAF: కర్ణాటకలో 300 అడుగులలోతులో పడిపోయిన యువకుడిని కాపాడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

300 అడుగుల లోతులో కొండ అంచున చిక్కుకున్న యువకుడిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రక్షించారు.

Youth rescued by IAF: కర్ణాటకలో 300 అడుగులలోతులో పడిపోయిన యువకుడిని కాపాడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

Yoth Iaf

Youth rescued by IAF: ఇటీవల కేరళలోని మాలంపుజా ప్రాంతంలో కొండల మధ్యలో చిక్కుకున్న యువకుడిని భారత సైన్యం కాపాడిన ఘటన తెలిసిందే. సరిగ్గా అటువంటి ఘటనే కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ పరిధిలోనూ చోటుచేసుకుంది. 300 అడుగుల లోతులో కొండ అంచున చిక్కుకున్న యువకుడిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రక్షించారు. ఆదివారం నాడు చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. నిశాంక్ అనే 19 ఏళ్ల యువకుడు ఆదివారం నాడు స్నేహితులతో చిక్కబళ్లాపూర్ జిల్లాలోని నంది హిల్స్ ప్రాంతానికి సరదగా ట్రెకింగ్ కి వెళ్ళాడు. ఈక్రమంలో బ్రహ్మగిరి శిలలు కొండ శ్రేణులపై యువకులు ట్రెకింగ్ చేస్తుండగా.. నిశాంక్.. జారిపడి 300 అడుగుల లోతులో కిందపడి కొండ అంచున చిక్కుకున్నాడు.

Also read: Visakhapatnam : INS సుమిత్రలో రాష్ట్రపతి

నిశాంక్ స్నేహితుల ద్వారా సమాచారం అందుకున్న చిక్కబళ్లాపూర్ జిల్లా కలెక్టర్.. స్థానిక పోలీసులతో ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అయితే కొండ నిటారుగా ఉండడంతో యువకుడిని రక్షించేందుకు కష్టతరంగా మారింది. దీంతో జిల్లా కలెక్టర్ యెలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు సమాచారం అందించి.. యువకుడిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సందేశంపై స్పందించిన ఎయిర్ ఫోర్స్ అధికారులు..యువకుడిని రక్షించేందుకు Mi17 హెలికాప్టర్ ను, ప్రధమ చికిత్స సిబ్బందిని పంపించారు. అయితే హెలికాప్టర్ దిగేందుకు కూడా అనువుగాని పక్షంలో..హెలికాప్టర్ లోనుంచి తీగ డోలిని యువకుడు ఉన్న ప్రదేశానికి జారవిడిచారు.

Also read: Weather Report: మార్చి మొదటి వారం నుంచే “మండే ఎండలు”

ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సూచనల ప్రకారం..నిశాంక్ ఆ డోలిని పట్టుకోగా..నెమ్మదిగా పైకి లాగారు. హెలికాప్టర్ లోనే ఉన్న ఎయిర్ ఫోర్స్ వైద్య సిబ్బంది నిశాంక్ కు ప్రధమ చికిత్స చేసి అనంతరం యెలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి స్నేహితులను కలుసుకున్న నిశాంక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. యువకుడు ప్రాణాలతో బయటపడడంతో అటు జిల్లా యంత్రాంగంతో పాటు ఇటు స్నేహితులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.