Visakhapatnam : INS సుమిత్రలో రాష్ట్రపతి

సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ప్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా

Visakhapatnam : INS సుమిత్రలో రాష్ట్రపతి

Vishaka

President Ram Nath Kovind :  విశాఖలో జరుగుతున్న ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొన్నారు. 2022, ఫిబ్రవరి 21వ తేదీ సోమవారం INS సుమిత్ర నౌకలో ఆయన ప్రయాణిస్తూ.. ప్లీట్ రివ్యూ నిర్వహించారు. రాష్ట్రపతి ప్రయాణించే నౌకకు ముందు, వెనుకా పైలెట్ వాహనాలు నౌకాలు ప్రయాణించాయి. యుద్ధ నౌకలు రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. అంతేగాకుండా ఆకాశంలో ఎయిర్ క్రాఫ్టులు కూడా సెల్యూట్ చేస్తూ… విన్యాసాలు జరిగాయి.

Read More : Visakha : విశాఖ సాగర తీరంలో యుద్ధనౌకల సమీక్ష..

ఈ విన్యాసాల్లో మొత్తం 10 వేల మందికి పైగా నేవీ సిబ్బంది పాల్గొన్నారు. ప్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ఆదివారం ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ప్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈసారి రివ్యూ చేస్తున్నారు. నౌకదళ విన్యాసాల్లో మొత్తం 44 యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు, జాతీయ ఓషణోగ్రఫీకి చెందిన నౌకలు పాల్గొంటున్నాయి. జలాంతర్గాములు, అత్యాధునిక నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఇందులో పాల్గొంటున్నాయి. విశాఖలో ఈ నెల 21 నుంచి మార్చి 4 వరకు తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూతో పాటు మిలాన్‌ కార్యక్రమాలు జరగనున్నాయి. వీటికి దేశ, విదేశాల నుంచి వందలాది మంది హాజరుకానున్నారు.

Read More : Vice President: విశాఖకు ఉపరాష్ట్రపతి.. నాలుగు రోజులు బస ఇక్కడే!

ఆదివారం నమూనా ఫ్లైపాస్ట్ విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలు వీక్షకుల ఒళ్లు గగుర్పొడిచాయి. యుద్ధ విమానాలు వాయివేగంతో ప్రయాణించడంతో భారీ శబ్ధాలకు ఆకాశం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ తో పాటు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 27వ తేదీన నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి వైఎంసీఏ వరకు అంతర్జాతీయ నగర కవాతు జరుగనుంది. INS వేలా జలాంతర్గామి, ఐఎన్ఎస్ తేజ్, శివాలిక్ శ్రేణి యుద్ధనౌకలు (మూడు), కమోర్తా యుద్ధనౌకలు, షిప్పింగ్ కార్పొరేషన్ కు చెందిన నౌకలు పీఎఫ్ఆర్ లో పాల్గొంటున్నాయి. కోస్ట్ గార్డ్ NIOT, కమోవ్ హెలికాప్టర్లు, సీకింగ్, చేతక్, ALH, డోర్నియర్, IL-38SD, P8I, హాక్, మిగ్ 29K తదితర యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి.