TS Politics : సైకిల్ దిగి కారెక్కి మూడేళ్లైనా దక్కని పదవి..మండవ వెంకటేశ్వరరావు రాజకీయ సన్యాసనం తీసుకోనున్నారా?

ఉమ్మడి రాష్ట్రంలో.. ఎమ్మెల్యేగా, మంత్రిగా.. నాలుగు దశాబ్దాల పాటు నిజామాబాద్ జిల్లా రాజకీయాలను శాసించిన లీడర్. అప్పట్లో.. ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబుకు.. కుడిభుజంగా ఉండేవారన్న టాక్ కూడా ఉంది. తెలంగాణలో టీడీపీ పతనమయ్యాక.. రాజకీయాలకు దూరంగా ఉన్న మండవ టీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరి మూడేళ్లు అయినా ఎటువంటి పదవి దక్కలేదు. దీంతో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోనున్నారని టాక్..

TS Politics : సైకిల్ దిగి కారెక్కి మూడేళ్లైనా దక్కని పదవి..మండవ వెంకటేశ్వరరావు రాజకీయ సన్యాసనం తీసుకోనున్నారా?

Trs Leader Mandava Venkateswara Rao

TS Politics : ఆయనో సీనియర్ లీడర్. అందరినీ.. కలుపుకొనిపోయే మనస్తత్వం. పదవుల కోసం పార్టీ మారే మనస్తత్వం కాదు. కానీ.. సన్నిహితుడికి ఇచ్చిన మాట కోసం.. పార్టీ మారాల్సి వచ్చింది. అధికార పార్టీలో చేరారు కదా.. మంచి పదవే వస్తుందనుకున్నారంతా. కానీ.. రాలేదు. పెద్దల సభకైనా పంపుతారనుకున్నారు. కానీ పంపలేదు. ఇక ఆయనకు ఆశల్లేవ్. దీంతో.. రాజకీయ సన్యాసం తీసుకుందామని డిసైడ్ అయినట్లు.. టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. అధికార పార్టీలో ఉన్న ఆ కూల్ లీడర్ ఎవరు?

మండవ వెంకటేశ్వరరావు. ఉమ్మడి రాష్ట్రంలో.. ఎమ్మెల్యేగా, మంత్రిగా.. నాలుగు దశాబ్దాల పాటు నిజామాబాద్ జిల్లా రాజకీయాలను శాసించిన లీడర్. అప్పట్లో.. ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబుకు.. కుడిభుజంగా ఉండేవారన్న టాక్ కూడా ఉంది. తెలంగాణలో టీడీపీ పతనమయ్యాక.. రాజకీయాలకు దూరంగా ఉన్న మండవను.. గత పార్లమెంట్ ఎన్నికల ముందు.. గులాబీ దళపతి చేరదీశారు. కేసీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి.. పర్సనల్‌గా కోరితేనే.. ఆయనతో ఉన్న స్నేహం మేరకు.. కారెక్కారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో.. ఎంతో కొంత ప్రభావం చూపుతారని కేసీఆర్ కూడా భావించారు. తర్వాత.. జిల్లా నాయకులంతా మండవకు మంచి పదవే వస్తుందనుకున్నారు. అయితే.. పదవుల కోసం పార్టీ మారలేదని ఆయన అనుచరులు పైకి చెబుతున్నా.. తమ నాయకుడి నెంబర్ ఎప్పుడొస్తుందా.. అని వెయిట్ చేస్తున్నారనే టాక్ ఉంది.

మండవ వెంకటేశ్వరరావు.. గులాబీ గూటికి చేరి మూడేళ్లయిపోయింది. ఆయన కంటే.. కొద్ది రోజుల ముందు కారెక్కిన మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డికి.. రాజ్యసభకు పంపారు కేసీఆర్. కానీ.. మండవను మాత్రం హోల్డ్‌లోనే పెట్టారు. దీంతో.. ఆయన పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారు. అయితే.. ఆయన్ని నమ్ముకున్న అనుచరులు.. ఏదో ఒక పదవితో మళ్లీ యాక్టివ్ అవ్వాలని ఒత్తిడి తెస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇదే సమయంలో.. నిజామాబాద్ జిల్లా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్ పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది. ఆయన స్థానంలో మండవను పెద్దల సభకు పంపుతారని.. ఆయన అనుచరులు అనుకున్నారు. కానీ.. ఆ అవకాశం కూడా దక్కలేదు.

మొత్తానికి.. సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు రాజకీయ భవితవ్యం ఏమిటన్నదే.. నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కానీ.. ఆయనకు పాలిటిక్స్ మీద ఇంట్రస్ట్ పోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. సుదీర్ఘ రాజకీయ అనుభవముంది. మచ్చ లేని నాయకుడనే పేరుంది. ఇంకా.. ఏవో పదవులొస్తాయని.. ఏదో ఒక దానికి ఎంపిక చేస్తారని వెయిట్ చేసే ఓపిక కూడా ఆయనకు లేదనే చర్చ జరుగుతోంది. కొన్నేళ్లుగా.. సైలెంట్‌గా ఉంటూ వస్తున్న మండవ.. ఇక.. రాజకీయ సన్యాసం తీసుకుందామనే నిర్ణయానికొచ్చినట్లు.. ఆయన అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే.. మండవకు.. కేసీఆర్ మరోసారి రాజకీయ పునర్జన్మనిస్తారా? లేక.. ఆయన ఇష్టానికి.. ఆయన్ని వదిలేస్తారా? అన్నది.. గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.