Telangana : కేటీఆర్ ఖమ్మం టూర్ వాయిదా వెనుక పెద్ద రీజనే ఉందట..!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మినిస్టర్ కేటీఆర్ ఖమ్మం టూర్ వాయిదా  పండింది.ఇందులో ఉన్న గొప్ప ఇన్ఫర్మేషన్ ఏంటో అనుకోవద్దు. వాయిదా వెనుక పెద్ద రీజనే ఉందట..!

Telangana : కేటీఆర్ ఖమ్మం టూర్ వాయిదా వెనుక పెద్ద రీజనే ఉందట..!

Postponing The Visit Of Minister Ktr Khammam

postponing the visit of Minister KTR Khammam : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం టూర్ వాయిదా పడింది. శనివారం (ఏప్రిల్ 16,2022) జరగాల్సిన టూరు రెండు రోజుల తరువాతకు వాయిదా పండింది.అంటే 18కు వాయిదా పడింది. ఇందులో ఉన్న గొప్ప ఇన్ఫర్మేషన్ ఏంటో అనుకోవద్దు. వాయిదా వెనుక పెద్ద రీజనే ఉంది. ఇందుకు.. ఖమ్మం జిల్లా నాయకుల్లో ఉన్న గ్రూపు తగాదాలే కారణమనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు ముగ్గురి మధ్య నడిచిన ఆధిపత్య పోరు మధ్యలోకి.. మరో లీడర్ ఎంటరయ్యారట. ఇదే.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ఎంపీ పొంగులేటికి వ్యతిరేకంగా.. జిల్లా ఎమ్మెల్యేలంతా పావులు కదపడంతోనే.. కేటీఆర్ తన ఖమ్మం టూర్‌ను రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నారన్న ప్రచారం సాగుతోంది.

Also read : China covid : షాంఘైలో పెరుగుతున్న కరోనా టెన్షన్‌..‘జీరో పాలసీ’ పేరుతో జనాలకు నరకం చూపిస్తున్న చైనా ప్రభుత్వం..

తెలంగాణలోని 33 జిల్లాల్లో.. పార్టీని, పార్టీ నాయకుల్ని సమర్థవంతంగా డీల్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకత్వానికి.. ఖమ్మం మాత్రం సవాల్‌గా మారింది. పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చాక కూడా.. ఖమ్మంలో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయ్. జిల్లాలో రాజకీయంగా బలంగానే ఉన్నా.. నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు పార్టీపై ప్రభావం చూపుతోంది. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో.. ఖమ్మంలో టీఆర్ఎస్ కేవలం ఏదో ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమవుతోంది. ఎలాంటి ఎలక్షన్ వచ్చినా.. లీడర్ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు.. ఫలితాలపై ప్రభావం చూపుతోందని.. పార్టీ అధినాయకత్వానికి.. ఎప్పటికప్పుడు స్పష్టమైన నివేదికలు అందుతున్నాయ్.

జిల్లాలో.. ఇప్పటిదాకా మూడు వర్గాలుగా కొనసాగుతున్న టీఆర్ఎస్ రాజకీయం.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నాలుగో వర్గం కూడా చేరింది. దీంతో.. కేడర్ 4 వర్గాలుగా చీలిపోయింది. రాజకీయంగా జిల్లాలో పట్టు సాధించేందుకు ఒకరు.. పట్టు నిరూపించుకునేందుకు మరికొందరు.. ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఖమ్మంలో టీఆర్ఎస్ అంటే.. మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాలే.. ఇప్పటివరకు కనిపించేవి. కొత్తగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన.. ఎమ్మెల్సీ తాతా మధు వర్గం కూడా తయారైంది. జిల్లాలో పట్టు కోసం.. ఆయన కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారని.. కేడర్‌లో చర్చ సాగుతోంది.

Also read : Bandi sanjay : కేసీఆర్‌ను గద్దె దించేదాక నా పోరు ఆగదు.. గద్వాల జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర

తాతా మధు వెనుక.. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి అండదండలున్నాయని.. ఖమ్మం జిల్లాపై పట్టు సాధించేందుకు తాతా మధు రాజకీయంగా పావులు కదుపుతున్నారని.. గుసగుసలు వినిపిస్తున్నాయ్. పల్లా సహకారంతోనే.. తాతా మధుకు పదవులు దక్కాయనే టాక్ కూడా ఉంది. పల్లా రాజేశ్వర్ డైరెక్షన్‌లోనే.. జిల్లాలో కొత్త వర్గం తయారైందనే చర్చ సాగుతోంది.

ఇప్పుడు కేటీఆర్ ఖమ్మం టూర్ వాయిదా పడటానికి కూడా.. తాతా మధు వర్గమే కీలకంగా వ్యవహరించిందని.. జిల్లా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి నివాసంలో.. కేటీఆర్ లంచ్‌ ఏర్పాట్లు ఉండేలా.. షెడ్యూల్ ఫిక్స్ అవడాన్ని జీర్ణించుకోలేని.. యాంటీ పొంగులేటి వర్గం.. పార్టీ పెద్దల ముందు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో.. మరో రెండు రోజులు టైమ్ తీసుకుంటే.. అప్పటివరకు నేతలకు సర్ది చెప్పి.. జిల్లాలో పర్యటించాలన్న అభిప్రాయంతో.. మంత్రి కేటీఆర్ తన పర్యటన వాయిదా వేసుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే.. రెండు సార్లు వాయిదా పడిన కేటీఆర్ ఖమ్మం టూర్.. ఈసారైనా ఉంటుందా.. లేదా.. అని కేడర్‌లో అనుమానం వ్యక్తమవుతోంది. గ్రూపు తగాదాలు అటు రాజకీయంగా.. ఇటు పార్టీపరంగా.. ప్రభావితం చేస్తాయన్న వాదన కూడా కార్యకర్తల్లో వినిపిస్తోంది.