Ask KTR : ఎల్పీజీ ధరలు ప్రపంచంలో నెంబర్ వన్ స్ధానానికి తీసుకెళ్లిన ఘనత మోదీకే దక్కింది-కేటీఆర్

పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలను ప్రపంచంలోనే నెంబర్ వన్ స్ధానానికి తీసుకు వెళ్లిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు.

Ask KTR : ఎల్పీజీ ధరలు ప్రపంచంలో నెంబర్ వన్ స్ధానానికి తీసుకెళ్లిన ఘనత మోదీకే దక్కింది-కేటీఆర్

Ask Ktr

Ask KTR : పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలను ప్రపంచంలోనే నెంబర్ వన్ స్ధానానికి తీసుకు వెళ్లిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. ఈరోజు ఆయన ట్విట్టర్ వేదికగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం ద్వారా సమాధానాలు ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎల్పీజీ ధరలు పెరిగినప్పుడు ధర్నాలు చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు స్పందించకపోవటం హిపోక్రసీ అని కేటీఆర్ అన్నారు. 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీలతో పాటు పలు రాజకీయ పార్టీలతో పోటీ ఎదుర్కుంటుందని కేటీఆర్ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తమ సుపరిపాలన కొనసాగేలా వచ్చే ఎన్నికల్లో విజయం దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీనీ,ప్రధాని మోదీని నిలదీస్తున్న టీఆర్ఎస్ జాతీయ స్ధాయిలో పార్టీని విస్తరించే అవకాశం ఉందా అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఏదైనా జరగొచ్చని ఆయన సమాధానం ఇచ్చారు. కర్ణాటకలో 2,500 కోట్లు ఇచ్చి సీఎం సీటు కొనుక్కోవచ్చని బీజేపీ అధిష్టానం చేసిన వ్యాఖ్యలు బీజేపీ అసలు రంగును బయట పెట్టిందని అన్నారు. ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించినట్లు మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఐఐఎం, ఐఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌, ఎన్‌ఐడీ సంస్థల్లో ఒక్కటీ కేంద్రం రాష్ట్రానికి ఇవ్వలేదని, ఎనిమిదేళ్లుగా అడుగుతున్నామని, ఇక కేంద్రం ఇస్తుందన్న నమ్మకం కూడా లేదన్నారు. బీఆర్‌ఎస్‌ అంశం హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని, బీఆర్‌ఎస్‌ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కేటీఆర్ తెలిపారు.

రాష్ట్రంలో రైతు అనుకూల విధానాలతో ఏడేళ్లలో సాగు 120శాతం పెరిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్లపైనే హత్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఓ నెజిటన్‌ పేర్కొనగా.. నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే మాధ్యమాలపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఆరోగ్యరంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, హైదరాబాద్‌లో మూడు కొత్తగా టిమ్స్‌ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిని అప్‌డేట్‌ చేస్తున్నామని, ౩౩ జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పుతున్నట్లు మంత్రి చెప్పారు.

Also Read : Liquor Kick : ఎంత తాగినా కిక్ ఎక్కలేదు-కల్తీ మద్యం అని హోంమంత్రికి ఫిర్యాదు చేసిన మందుబాబు