TSRTC : పోటీ పరీక్షల అభ్యర్ధులకు టీఎస్ఆర్టీసి బంపరాఫర్

నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసి శుభవార్త చెప్పింది. పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్ధులకు బస్ పాస్ లపై రాయితీ కల్పించింది.  సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, బస్ పాస్ లపై ముూడు నెలలపాటు 20 శాతం రాయితీని ఇస్తున్నట్లు సంస్ధ తెలిపింది.

TSRTC : పోటీ పరీక్షల అభ్యర్ధులకు టీఎస్ఆర్టీసి బంపరాఫర్

Tsrtc Bus Pass

TSRTC : నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసి శుభవార్త చెప్పింది. పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్ధులకు బస్ పాస్ లపై రాయితీ కల్పించింది.  సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, బస్ పాస్ లపై ముూడు నెలలపాటు 20 శాతం రాయితీని ఇస్తున్నట్లు సంస్ధ తెలిపింది.

ఆర్డినరీ సిటీ  బస్ పాస్ రూ.3,450, ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ రూ.3,900 ఉండగా రాయితీ తర్వాత ఇవి వరుసగా రూ. 2,800, రూ.3,200 కి లభిస్తాయి. అభ్యర్ధులు బస్ పాస్ పొందటానికి సంతకం చేసిన దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు, లేదా ప్రభుత్వం జారీ చేసిన నిరుద్యోగ గుర్తింపు కార్డు జతచేయాల్సి ఉంటుందని టీఎస్ఆర్టీసీ తెలిపింది.

Also Read : Yadagirigutta Parking Charges : గంటకు రూ.500.. యాదగిరిగుట్టపై పార్కింగ్‌ చార్జీల బాదుడు