Aadhaar Violators: ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పదు రూ.కోటి జరిమానా

ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. దాంతో పాటు రూ.కోటి వరకూ జరిమానా కూడా చెల్లించాల్సిందే.

Aadhaar Violators: ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పదు రూ.కోటి జరిమానా

Uidai

Updated On : November 4, 2021 / 12:09 PM IST

Aadhaar Violators: ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. దాంతో పాటు రూ.కోటి వరకూ జరిమానా కూడా చెల్లించాల్సిందే. దాదాపు రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిని బట్టి.. యూఐడీఏఐ ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి న్యాయనిర్ణేతలను నియమించుకునే అధికారం వచ్చినట్లే. న్యాయనిర్ణేత అధికారులు ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన సంస్థలు/వ్యక్తులపై విచారణ జరిపి రూ.1 కోటి వరకు జరిమానా విధించే అవకాశాన్ని కల్పించింది.

తీర్పుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సదరు సంస్థలు టెలికాం వివాదాల పరిష్కారం, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించవచ్చు. ఈ నిబంధనల అమలుకోసం కేంద్ర ప్రభుత్వం ఆధార్, ఇతర శాసనాల (సవరణ) బిల్లు, 2019కి ఆమోదముద్ర వేసింది. ఈ చట్టాలు అమలుచేయడానికి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి రెగ్యూలేటర్‌తో సమానమైన అధికారాలు లభించాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల యూజర్ల డేటాకు మరింత ప్రొటెక్షన్ లభించినట్లే.

UIDAI రూల్స్, 2021ని నవంబర్ 2న ప్రభుత్వం నోటిఫై చేసింది, వీటి ప్రకారం UIDAI చట్టం లేదా UIDAI ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు ఆధార్ పర్యావరణ వ్యవస్థలోని సంస్థపై ఫిర్యాదును ప్రారంభించే అవకావం ఉంది. UIDAIకి అవసరమైన సమాచారాన్ని అందించవచ్చు. UIDAIచే నియమించబడిన న్యాయనిర్ణేత అధికారులు అటువంటి విషయాలను నిర్ణయిస్తారు. అటువంటి సంస్థలపై రూ. 1 కోటి వరకు జరిమానాలు విధించవచ్చు.

…………………………………………………. : దీపావళి రోజు సెలవు ప్రకటించాలి, దీపావళి డే యాక్ట్ బిల్లు

న్యాయనిర్ణేత అధికారికి సాక్ష్యం ఇవ్వడానికి కేసు వాస్తవాలు, పరిస్థితులతో పరిచయమున్న ఏ వ్యక్తినైనా పిలిపించి, హాజరుపరిచే అధికారం ఉంటుంది.