Deepavali : అమెరికాలో దీపావళి బిల్లు.. పండుగ పూట సెలవు కోసం

దీపావళి పండుగ రోజున అమెరికాలో కూడా సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ..ఆ దేశ చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి మలోనే ప్రతినిధుల సభలో దీపావళి డే యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.

Deepavali : అమెరికాలో దీపావళి బిల్లు.. పండుగ పూట సెలవు కోసం

Deepavali

Updated On : November 4, 2021 / 12:05 PM IST

Deepavali Day Act : : దీపావళి పండుగ రోజున అమెరికాలో కూడా సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ..ఆ దేశ చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి మలోనే ప్రతినిధుల సభలో దీపావళి డే యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సంబంధించిన వివరాలను ఆమె స్వయంగా వెల్లడించారు. దీపావళి డే యాక్ట్ బిల్లును సభలో ప్రవేశపెట్టడం తనకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. మంచిపై చెడు, చీకటిపై వెలుతురు గుర్తుగా ఈ పండుగను జరుపుకోవడం విశేషమన్నారు.

Read More : WhatsApp : వాట్సాప్‌లో మీకు నచ్చినవారికి ‘Happy Diwali Sticker’ ఇలా పంపుకోవచ్చు..!

ప్రస్తుత కరోనా ఉధృతి కొనసాగుతున్నా..ఈ పండుగకు ప్రాధాన్యం ఉందని, దీపావళి ఫెడరల్ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించాలని కరోలిన్ కోరారు. ఈ బిల్లుకు పలువురు మద్దతు తెలిపారు. భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి, పలువురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గ్రెగరీ మీక్స్ తదితరులు మద్దతు తెలియచేసిన వారిలో ఉన్నారు. ప్రజల జీవితాలకు వెలుగులు ప్రసాదించే దీపావళి పండుగను ఫెడరల్ హాలీడేగా ప్రకటించడం కరెక్టుగా ఉంటుందని రాజీ కృష్ణమూర్తి వెల్లడించారు.

Read More : Petrol – Diesel: పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.12వరకూ తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం

మరోవైపు…భారతదేశ వ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని తదితరులు దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. చీక‌టిపై వెలుగు, చెడుపై మంచి విజ‌యానికి ప్ర‌తీక దీపావ‌ళి అని, అంద‌రి ఇంట ఆనంద‌పు కాంతులు నింపాల‌ని వారు ఆకాంక్షించారు. సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు.