Upasana : రామ్‌చరణ్ లాంటి భర్త దొరకడం నా అదృష్టం.. భర్త లేని మహిళల కోసం ఉపాసన సహాయం..

క్లీంకారకి జన్మనించిన తరువాత ఉపాసన మొదటిసారి మీడియాతో మాట్లాడారు. భర్త లేని మహిళల కోసం ఉపాసన సహాయం అందిస్తూ..

Upasana : రామ్‌చరణ్ లాంటి భర్త దొరకడం నా అదృష్టం.. భర్త లేని మహిళల కోసం ఉపాసన సహాయం..

Upasana about Ram Charan at Apollo Childrens Hospital logo launch event

Upasana – Ram Charan : రామ్ చరణ్ అండ్ ఉపాసన తమ పెళ్లయిన 11 ఏళ్ళ తరువాత క్లీంకార (Klin Kaara) జన్మనించి తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ఉపాసన అపోలో హాస్పిటల్ కుటుంబం నుంచి వచ్చి ఉండడంతో బేబీ విషయంలో ఎన్నో జాగ్రత్తులు తీసుకున్నారు. అయితే గర్భవతిగా ఉన్న భార్యకి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఒకటే సరిపోదు, భర్త ప్రేమ కూడా ఎంతో కావాల్సి ఉంటుంది. ఈక్రమంలోనే ఉపాసన ప్రెగ్నన్సీ సమయంలో రామ్ చరణ్.. తనని కంటికి రెప్పలా చూసుకున్నాడు.

Samantha : చిన్నపిల్లలతో సమంత ఆటలు.. వీడియో వైరల్.. వాళ్ళు టాలీవుడ్‌లో ఎవరి పిల్లలో తెలుసా..?

ఎక్కడికి వెళ్లినా ఉపాసన చెయ్యి వదలకుండా ఒక చంటిపాపలా చూసుకున్నాడు. ఆ సమయంలో భార్య పై చరణ్ ప్రేమ చూసి అందరూ ఫిదా అయ్యిపోయారు. తాజాగా ఉపాసన అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ (Apollo Childrens Hospital) లోగో లాంచ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. “చరణ్ లాంటి భర్త దొరకడం నా అదృష్టం. బిడ్డ యోగక్షేమాలు చూసుకునే విషయంలో చరణ్ ఎంతగానో సహకరిస్తారు. కానీ భర్త సహాయం లేని తల్లుల పరిస్థితి ఏంటనే ఆలోచన నేను తల్లి అయ్యాకే వచ్చింది. వారికోసమే అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ ని అందుబాటులోకి తీసుకు వస్తున్నాము. వారాంతాల్లో సింగల్ పేరెంట్ తల్లులు వారి పిల్లలని అపోలోకి తీసుకు వచ్చి డాక్టర్ కన్సల్టెన్సీ ఉచితంగా పొందవచ్చు” అని తెలియజేశారు.

Rajinikanth : విజయ్ ‘బీస్ట్’ మూవీ హిట్ అయ్యిందా..? ప్లాప్ అయ్యిందా..? రజినీకాంత్ కామెంట్స్..

ఈ నిర్ణయంతో సింగల్ పేరెంట్ మహిళలకు ఎంతో ఉపయోగం కలగనుంది. ఇక ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఉపాసనను అందురు అభినందిస్తున్నారు. కాగా సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ తమ కూతురుకి లలితా సహస్రనామం నుంచి స్ఫూర్తి పొంది ‘క్లీంకార’ అని పేరు పెట్టడంతో కూడా ఈ మెగా జంట అందరి అభినందనలు అందుకున్నారు. అలాగే ఆ తరువాత నామకరణ కార్యక్రమాన్ని అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు జాతి సంస్కృతిలో నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు.