Vallabhaneni Janardhan : టాలీవుడ్‌లో మరో విషాదం.. గ్యాంగ్ లీడర్ నటుడు మృతి..

తెలుగు సినీ పరిశ్రమని వరుస మరణాలతో విషాదం వెంటాడుతుంది. ఇటీవలే రోజులు వ్యవధిలో సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, చలపతి రావు మరణించగా, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు మరియు నటుడు వల్లభనేని జనార్దన్ మృతి చెందారు. 63 ఏళ్ళ జనార్దన్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నేడు అపోలో ఆసుపత్రి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Vallabhaneni Janardhan : టాలీవుడ్‌లో మరో విషాదం.. గ్యాంగ్ లీడర్ నటుడు మృతి..

Vallabhaneni Janardhan passed away

Updated On : December 29, 2022 / 11:59 AM IST

Vallabhaneni Janardhan :తెలుగు సినీ పరిశ్రమని వరుస మరణాలతో విషాదం వెంటాడుతుంది. ఇటీవలే రోజులు వ్యవధిలో సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, చలపతి రావు మరణించగా, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు మరియు నటుడు వల్లభనేని జనార్దన్ మృతి చెందారు. 63 ఏళ్ళ జనార్దన్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నేడు అపోలో ఆసుపత్రి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Isha Alya : పాయింట్ బ్లాక్‌ రేంజ్‌లో నటిపై కాల్పులు..

1959లో సెప్టెంబర్ 25న ఏలూరు దగ్గర పోతునూరులో జన్మించారు. విజయవాడ లయోలా కాలేజ్‌లో విద్యని అభ్యసించిన జనార్దన్ డిగ్రీ పట్టా అందుకోక ముందే సినిమా మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు. తానే సొంత నిర్మాణ సంస్థ పెట్టి ‘మమ్మగారి మనవలు’ టైటిల్ తో ఒక సినిమా మొదలుపెట్టగా, అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత కన్నడ హిట్ సినిమా ‘మానససరోవర్’ని తెలుగులో చంద్రమోహన్ తో ‘అమాయక చక్రవర్తి’గా తెరకెక్కికించారు. ఆ వెంటనే శోభన్ బాబుతో ‘తోడు నీడ’ అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించారు.

అయన కూతురి పేరుతో శ్వేత ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించి ‘శ్రీమతి కావాలి’, ‘పారిపోయిన ఖైదీలు’ వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు. అయితే ‘శ్రీమతి కావాలి’ సమయంలో ఒక నటుడు రాకపోయే సరికి వల్లభనేని జనార్దనే నటించడంతో, నటుడిగా కొత్త కెరీర్ ని మొదలు పెట్టారు. ప్రముఖ దర్శకుడు విజయ్ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాల్లో జనార్దన్ నటుడిగా నటించారు. అందులో ఒకటి చిరంజీవి గ్యాంగ్ లీడర్. ఈ సినిమాలో సుమలత తండ్రి పాత్రలో ఆయన కనిపించరు.

ఇంకో విషయం ఏంటంటే, జనార్దన్, డైరెక్టర్ బాపినీడు కూతురుని పెళ్లి చేసుకొని ఆయనకి అల్లుడయ్యాడు. వీరిద్దరూ కలిసి పలు సినిమాలు కూడా నిర్మించారు. అందులో ఒకటి శ్రీనువైట్ల మొదటి మూవీ ‘నీ కోసం’. ‘స్టూవర్టుపురం దొంగలు’ సినిమాతో జనార్దన్ నటుడిగా 100 సినిమాలు పూర్తీ చేసుకున్నారు. చిరంజీవితో పలు సినిమాలో నటించిన జనార్దన్.. బాలకృష్ణతో లక్ష్మినరసింహ, వెంకటేష్‌తో సూర్య ఐపిఎస్, నాగార్జునతో వారసుడు సినిమాలో నటించారు. వీటితో పాటు ‘అన్వేషిత’ వంటి సీరియల్స్ లో కూడా నటించారు.