Varun Tej : ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘భీమ్లా నాయక్’ వాయిదా పడినట్టే..
థియేటర్లపై సందిగ్దత నెలకొనడంతో ఇటీవల అన్ని సినిమాలు రెండు రిలీజ్ డేట్స్ ని అన్నౌన్స్ చేస్తున్నారు. 'గని' సినిమా కూడా గతంలో రెండు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 25......

Ghani
Ghani : మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ‘గని’ సినిమా కిక్ బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. ఇందులో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ కూడా చేస్తుంది.
థియేటర్లపై సందిగ్దత నెలకొనడంతో ఇటీవల అన్ని సినిమాలు రెండు రిలీజ్ డేట్స్ ని అన్నౌన్స్ చేస్తున్నారు. ‘గని’ సినిమా కూడా గతంలో రెండు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 25 లేదా మార్చ్ 4న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు చిత్ర యూనిట్. అయితే తాజాగా ‘గని’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 25నే ఈ సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు.
Vishnu Vishal : ముస్లిమ్స్ కి ఈ సినిమా వ్యతిరేకమనుకున్నారు.. కానీ..
అయితే పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘బీమ్లా నాయక్’ సినిమా కూడా ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ లో కూడా మరో డేట్ అనౌన్స్ చేశారు. అయితే బాబాయికి పోటీగా వరుణ్ తన సినిమాని రిలీజ్ చేయడు. కానీ ఇవాళ వరుణ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అంటూ ఫిబ్రవరి 25 డేట్ ని అనౌన్స్ చేయడంతో ‘బీమ్లా నాయక్’ ఫిబ్రవరిలో లేనట్టే అని అర్ధమవుతుంది. ‘బీమ్లా నాయక్’ వాయిదా పడడం వల్లే ‘గని’ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఇది పవన్ అభిమానులకు మరింత నిరాశ కలిగిస్తుంది.
3 years of our blood & sweat.
The time has finally come to earn your respect on February 25th!See you in theatres!???#Ghani #GhanionFeb25 pic.twitter.com/3SZWxkac3e
— Varun Tej Konidela ? (@IAmVarunTej) February 15, 2022