Chiranjeevi: చిరు సినిమాపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన డైరెక్టర్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా మారాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్’ సినిమాను....

Chiranjeevi: చిరు సినిమాపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన డైరెక్టర్!

Venky Kudumula Denies Rumours Of Chiranjeevi Movie

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా మారాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్’ సినిమాను చివరిదశకు తీసుకొచ్చిన చిరు, మరో డైరెక్టర్ మెహర్ రమేష్‌తో ‘భోళాశంకర్’ సినిమాను కూడా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు మరో యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్‌గా సమ్మర్ వెకేషన్‌కు ఫారిన్ వెళ్లిన మెగాస్టార్ తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఇక తన సినిమా షూటింగ్స్‌తో మళ్లీ బిజీగా మారేందుకు చిరు రెడీ అవుతున్నారు.

Chiranjeevi : ఆచార్య ఎఫెక్ట్‌తో చిరు నెక్స్ట్ సినిమాల్లో మార్పులు??

ఈ క్రమంలో మరో యంగ్ డైరెక్టర్‌తో చిరు సినిమా చేయబోతున్నాడని.. గతంలోనే వీరిద్దరి మధ్య చర్చలు జరిగినా, చిరు ఈ సినిమాపై ఆసక్తిగా లేకపోవడంతో, ఈ చిత్రాన్ని పక్కనబెట్టినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ యంగ్ డైరెక్టర్ ఎవరో ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉంటుంది. ఛలో సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, భీష్మ సినిమాతో వరుసగా సక్సెస్‌ను అందుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల. ఈ డైరెక్టర్ చిరంజీవి కోసం ఓ కథను రెడీ చేశాడని.. దాన్ని చిరుకు వినిపించాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై చిరు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇయ్యలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి.

Chiranjeevi: డైరెక్టర్స్‌కు మెగా ఇన్‌స్ట్రక్షన్స్.. ఈసారి గురి తప్పేదేలే!

అయితే తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చిరుతో తన మూవీపై వెంకీ కుడుముల కుండ బద్దలుకొట్టాడు. చిరంజీవితో తన నెక్ట్స్ మూవీ తప్పకుండా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందంటూ వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు. చిరు కోసం తానొక అదిరిపోయే కథను రెడీ చేస్తున్నట్లు, ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు పనులు పూర్తికాగానే ఆయన పూర్తికథను వినిపించి, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతానంటూ వెంకీ చెప్పుకొచ్చారు. దీంతో వెంకీ కుడుముల – చిరు సినిమాపై వస్తున్న పుకార్లకు ఆయన చెక్ పెట్టినట్లయ్యింది.