Unstoppable with NBK : మా నాన్న, పూరి జగన్నాధ్ కలిసి పని చేసారు : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కూడా చాలా ఆసక్తికర విషయాలని వెల్లడించారు షోలో. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు నటుడు అవ్వాలి అనుకున్నారని, కానీ కాలేకపోయారని చెప్పాడు. అందుకే తాను............

Unstoppable with NBK : మా నాన్న, పూరి జగన్నాధ్ కలిసి పని చేసారు : విజయ్ దేవరకొండ

Vijay Puri

Updated On : January 15, 2022 / 12:48 PM IST

Unstoppable with NBK :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో విజయవంతంగా నడుస్తుంది. బాలకృష్ణ తనదైన స్టైల్ లో ఈ షోతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. తాజాగా రిలీజ్ అయిన తొమ్మిదో ఎపిసోడ్ లో’ లైగర్’ సినిమా టీం నుంచి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, ఛార్మి వచ్చారు. ‘సమరసింహా రెడ్డి’ వెల్కమ్స్ ‘అర్జున్ రెడ్డి’ అంటూ మొదలైన ఈ ఎపిసోడ్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది.

Chiranjeevi : హ్యాపీ ఎండింగ్.. చిరు, జగన్ భేటీపై నాగార్జున కామెంట్స్

విజయ్ దేవరకొండ కూడా చాలా ఆసక్తికర విషయాలని వెల్లడించారు షోలో. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు నటుడు అవ్వాలి అనుకున్నారని, కానీ కాలేకపోయారని చెప్పాడు. అందుకే తాను ఎట్టి పరిస్థితుల్లో హీరో అవ్వాలని ఫిక్స్ అయి కష్టపడి హీరో అయ్యానని తెలిపాడు. అంతే కాకుండా విజయ్ తండ్రి గోవర్దన రావు, పూరీ జగన్నాథ్ తో కలిసి దూరదర్శన్‌లో పని చేశారు అనే విషయాన్ని గుర్తు చేశాడు. విజయ్ తండ్రి కూడా టీవీ, సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా, డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేసిన సంగతి తెలిసిందే.