Vijay Devarakonda: ఈడీ ముందుకు విజయ్ దేవరకొండ.. లైగర్ లావాదేవీలపై ఆరా

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ ప్రొడ్యూస్ చేయడంతో వారు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇక సినిమా ఫెయిల్యూర్‌ను పక్కనబెడితే ఇప్పుడు ఈ సినిమా యూని‌ట్‌కు ఈడీ అధికారులు వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు.

Vijay Devarakonda: ఈడీ ముందుకు విజయ్ దేవరకొండ.. లైగర్ లావాదేవీలపై ఆరా

Vijay Devarakonda To Be Questioned By ED

Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ ప్రొడ్యూస్ చేయడంతో వారు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇక సినిమా ఫెయిల్యూర్‌ను పక్కనబెడితే ఇప్పుడు ఈ సినిమా యూని‌ట్‌కు ఈడీ అధికారులు వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు.

Liger: “పూరీ-డిస్ట్రిబ్యూటర్”ల వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి..

లైగర్ చిత్రానికి భారీ బడ్జెట్‌ను కేటాయించడమే ఇప్పుడు చిత్ర యూనిట్‌కు తలనొప్పిగా మారింది. ఈ సినిమాకు ఇంత భారీ బడ్జెట్‌ను ఎలా సమకూర్చారని ఈడీ ఆరా తీస్తోంది. లైగర్ చిత్రానికి సంబంధించిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాధ్, నిర్మాత ఛార్మీ కౌర్‌లను విచారించారు. తాజాగా ‘లైగర్’ హీరో విజయ్ దేవరకొండను ఈ అంశంపై విచారణ చేసేందుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విజయ్ దేవరకొండ కొద్దిసేపటి క్రితమే ఈడీ ఆఫీసుకు చేరుకున్నాడు.

Puri Jagannadh: ఈడీ ఆఫీసులో పూరి, ఛార్మి.. ‘లైగర్’ చిత్ర లావాదేవీలపై విచారణ!

లైగర్ చిత్రానికి గాను తనకు ఎంతమేర రెమ్యునరేషన్ ఇచ్చారు, ఈ చిత్రానికి సంబంధించిన లావాదేవీలపై ఆయన్ను విచారించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు విదేశాల నుంచి, పలువురు రాజకీయ నేతల నుంచి లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే లైగర్ చిత్ర యూనిట్‌ను వరుసగా విచారణ చేస్తున్నారు. మరి ఈ వివాదం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.