Puri Jagannadh: ఈడీ ఆఫీసులో పూరి, ఛార్మి.. ‘లైగర్’ చిత్ర లావాదేవీలపై విచారణ!

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, నటి కమ్ నిర్మాత ఛార్మి కౌర్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలోనూ వీరిద్దరి పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వీరిద్దరు కలిసి నిర్మించిన ‘లైగర్’ మూవీ వీరికి సరికొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది.

Puri Jagannadh: ఈడీ ఆఫీసులో పూరి, ఛార్మి.. ‘లైగర్’ చిత్ర లావాదేవీలపై విచారణ!

Puri Jagannadh Charmee Kaur In ED Office For Liger Transactions

Updated On : November 17, 2022 / 8:06 PM IST

Puri Jagannadh: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, నటి కమ్ నిర్మాత ఛార్మి కౌర్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలోనూ వీరిద్దరి పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వీరిద్దరు కలిసి నిర్మించిన ‘లైగర్’ మూవీ వీరికి సరికొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కి.. ప్రేక్షకులను మెప్పించడంలో ఘోరంగా విఫలమయ్యింది.

Puri Jagannadh: నేను ఎవడినైనా మోసం చేసానంటే.. అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకుడినే.. పూరి ప్రెస్ నోట్ రిలీజ్!

అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సినిమా కోసం జరిగిన నగదు లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై పలు ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో రాజకీయ నేతల పెట్టుబడులు ఉన్నట్లుగా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై 15 రోజుల క్రితమే పూరికి ఈడీ నోటీసులు ఇవ్వగా, కొద్దిసేపటి క్రితం ఛార్మితో కలిసి పూరి ఈడి కార్యాలయానికి చేరుకున్నారు.

Puri Jagannadh : పూరి ఇంటి వద్ద భద్రత.. కోర్టుకి వెళ్తామంటున్న డిస్ట్రిబ్యూటర్లు..

విదేశాలకు చెందిన అకౌంట్స్ నుండి డబ్బులు బదిలీ అయినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో విచారణ నిమిత్తం పూరి, ఛార్మిలను ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా వారు తెలిపారు. దీంతో ఈడీ ఆఫీసుకు వచ్చిన పూరీ, ఛార్మిలను అధికారులు విచారిస్తున్నారు. మరి ఈ వివాదంలో ఇంకా ఎలాంటి సంచలనాలను బయటపడతాయా అని సినీ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.