Puri Jagannadh : పూరి ఇంటి వద్ద భద్రత.. కోర్టుకి వెళ్తామంటున్న డిస్ట్రిబ్యూటర్లు..

తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని లైగర్ నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైన్షియర్ శోభన్ పై పూరి జగన్నాధ్ పోలీసులకి ఫిర్యాదు చేసి తమ ఇంటికి భద్రత కల్పించాలని............

Puri Jagannadh : పూరి ఇంటి వద్ద భద్రత.. కోర్టుకి వెళ్తామంటున్న డిస్ట్రిబ్యూటర్లు..

Liger Distributors wants to go to court againest Puri Jagannadh

Puri Jagannadh :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సినిమాని కొన్ని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయారు. దీంతో గత కొన్ని రోజులుగా లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంతా తమ నష్టాన్ని భర్తీ చేయాలని పూరి జగన్నాధ్ చుట్టూ తిరుగుతున్నారు. పూరి డబ్బులు ఇస్తాను కానీ టైం పడుతుంది అని చెప్పినా వినకుండా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పూరి ఇంటి వద్ద ధర్నాకి దిగుతామని, డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోము అని పూరీని బ్లాక్ మెయిల్ చేయడంతో ఈ వివాదం టాలీవుడ్ లో చర్చగా మారింది.

పూరి దీనిపై స్పందిస్తూ డబ్బులు ఇస్తాను కానీ టైం పడుతుంది, ధర్నాలు అంటూ ఏమైనా చేసి నా పరువు మాత్రం తీస్తే నేను ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాక తనకి, తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని లైగర్ నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైన్షియర్ శోభన్ పై పూరి జగన్నాధ్ పోలీసులకి ఫిర్యాదు చేసి తమ ఇంటికి భద్రత కల్పించాలని కోరాడు. దీంతో పోలీసులు పూరి జగన్నాధ్ ఇంటివద్ద గురువారం నుంచి కొంతమంది పోలీసులని ఉంచారు.

Vijay Devarakonda : విజయ్ దేవరకొండకి పెళ్లి అయిపొయింది.. జాన్వీ వ్యాఖ్యలు..

ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ హైదరాబాద్‌లో లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ధర్నాని వాయిదా వేశారు. అంతేకాక ‘లైగర్‌’ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని బాధిత డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అనుకుంటున్నారు. రోజు రోజుకి ఈ వివాదం మరింత ముదురుతోంది. మరి ఈ వివాదాన్ని పూరి ఎలా పరిష్కరిస్తాడో చూడాలి. లైగర్ సినిమా గురించి ఇంత గొడవ జరుగుతున్నా సినిమా రిలీజ్ కి ముందు ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడిన విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ గా ఉండటం గమనార్హం.