Vijay Devarakonda : విజయ్ దేవరకొండకి పెళ్లి అయిపొయింది.. జాన్వీ వ్యాఖ్యలు..

తాజాగా జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జాన్వీ ప్రస్తుతం తన మిలీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ పేరు రావడంతో జాన్వీ..................

Vijay Devarakonda : విజయ్ దేవరకొండకి పెళ్లి అయిపొయింది.. జాన్వీ వ్యాఖ్యలు..

Janhvi Kapoor Comments on Vijay Devarakonda Marriage

Updated On : October 28, 2022 / 8:07 AM IST

Vijay Devarakonda :  విజయ్ దేవరకొండకి సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా అతని యాటిట్యూడ్ కి, మాట్లాడే విధానానికి అభిమానులు ఏర్పడ్డారు. ఇక అమ్మాయిల్లో అయితే అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాధారణ అమ్మాయిలే కాకా సెలబ్రిటీలు, హీరోయిన్స్ కూడా విజయ్ కి అభిమానులే. బాలీవుడ్ లో అయితే విజయ్ దేవరకొండకి చాలా మంది సెలబ్రిటీలు ఫ్యాన్స్. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ విజయ్ తో నటించాలని ఉందని, విజయ్ తో డేటింగ్ చేయాలని ఉందని.. ఇలా ఇప్పటికే చాలా సార్లు, చాలా మంది చెప్పారు.

తాజాగా జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జాన్వీ ప్రస్తుతం తన మిలీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ పేరు రావడంతో జాన్వీ ఈ వ్యాఖ్యలు చేసింది. యాంకర్.. ఒకవేళ మీకు స్వయంవరం పెడితే ఇండస్ట్రీ నుంచి ఏ ఇద్దరు హీరోలు పాల్గొనాలని అనుకుంటారు అని అడిగాడు. జాన్వీ దీనికి సమాధానంగా.. రణ్‌బీర్‌ కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌ అని చెప్పగా రణబీర్ కి పెళ్లి అయిపోయింది. పెళ్లి కానీ వాళ్ళ గురించి చెప్పండి అని విజయ్ దేవరకొండ పేరు వద్దా లిస్ట్ లో అని అడిగాడు.

Samantha : సమంతతో నేను అప్పుడే ప్రేమలో పడిపోయాను.. ఇప్పటికి కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్..

జాన్వీ.. విజయ్ కి ఆల్రెడీ ప్రాక్టికల్ గా పెళ్లి అయిపోయింది అని సమాధానం చెప్పింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. విజయ్ ఎవరితో రిలేషన్ లో ఉన్నాడో అంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు. రష్మిక తో రిలేషన్ లో ఉన్నాడని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ గతంలో కరణ్ జోహార్ షోలో కూడా విజయ్, రష్మిక గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడారు. ఇప్పుడు జాన్వీ విజయ్ కి పెళ్లి అయిపోయింది అనడంతో మరోసారి రష్మిక, విజయ్ ట్రెండ్ అవుతున్నారు. దీనిపై విజయ్ ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి.