Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్.. సౌత్ నుండి ఫస్ట్ హీరో..

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నేషనల్ వైడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. యూత్‌లో ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు మరో క్రేజీ న్యూస్‌లో నిలిచాడు..

Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్.. సౌత్ నుండి ఫస్ట్ హీరో..

Vijay Deverakonda In Dabboo Ratnani Calendar 2021

Updated On : June 14, 2021 / 7:16 PM IST

V‌ijay Deverakonda: యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నేషనల్ వైడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూత్‌లో ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు మరో క్రేజీ న్యూస్‌లో నిలిచాడు. పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్‌లో చోటు సంపాదించాడు. బాలీవుడ్ స్టార్‌ల సరసన విజయ్ ఆ క్యాలెండర్‌లో కనిపించాడు.

సౌత్ ఇండియా నుండి ఈ క్యాలెండర్‌లో చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. చేసిన 9 సినిమాలకే ఇలాంటి నేషనల్ క్రేజ్ సంపాదించడం గమనార్హం. దీనికి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు డబూ రత్నాని. రగ్గడ్ అండ్ స్టైలిష్ లుక్‌లో విజయ్ సెక్సీగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లాంచ్ చేసిన సందర్భంగా విజయ్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ముచ్చటించాడు డబూ.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘ఈ ఫొటో షూట్ చాలా తొందరగా, చాలా క్వాలిటీతో జరిగింది. కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ క్యాలెండర్‌లో కనిపించారు. నేను షారుఖ్ ఖాన్ సర్‌ను మీ క్యాలెండర్‌లో చూసా. తను చాలా మంచి వ్యక్తి. అప్పటినుండి నేను మీ క్యాలెండర్‌లో కనిపిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. ఫైనల్‌గా నా కోరిక తీరింది’’ అన్నారు.

డబూ రత్నాని మాట్లాడుతూ.. ‘‘థాంక్యూ విజయ్ దేవరకొండ నా క్యాలెండర్‌లో డెబ్యూ చేసినందుకు. మీరు చాలా కూల్ పర్సన్. ఈ ఫొటో షూట్ చేసినపుడు చాలా ఎంజాయ్ చేసాను. నా క్యాలెండర్‌లో కనిపించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ మీరు. నేను షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటో షూట్ మీదే. థాంక్యూ..’’ అన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)