Pan India Artists : పాన్ ఇండియా ఆర్టిస్టులు.. వీళ్ళు సినిమాల్లో ఉంటే సినిమాకే ప్లస్సు..

ఇండస్ట్రీ ఏదైనా కొంతమంది స్టార్లు వాళ్ళ సినిమాల్లో ఉండాల్సిందే. సినిమా ఎలాంటిదైనా ఆ టాప్ ఆర్టిస్టులు ఉంటే సినిమాకి క్రేజ్ పెరుగుతుంది. ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలో చాలా వరకు ఈ స్టార్ కాస్ట్ ని తమ సినిమాల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. కనీసం గెస్ట్ అప్పీరెన్స్ అయినా..................

Pan India Artists : పాన్ ఇండియా ఆర్టిస్టులు.. వీళ్ళు సినిమాల్లో ఉంటే సినిమాకే ప్లస్సు..

most wanted artists over pan india wide

Pan India Artists :  ఇండస్ట్రీ ఏదైనా కొంతమంది స్టార్లు వాళ్ళ సినిమాల్లో ఉండాల్సిందే. సినిమా ఎలాంటిదైనా ఆ టాప్ ఆర్టిస్టులు ఉంటే సినిమాకి క్రేజ్ పెరుగుతుంది. ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలో చాలా వరకు ఈ స్టార్ కాస్ట్ ని తమ సినిమాల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. కనీసం గెస్ట్ అప్పీరెన్స్ అయినా ఇప్పించాలని చూస్తున్నారు. ఇలా ఇప్పుడు కొంతమంది టాప్ ఆర్టిస్టులు దేశం మొత్తం మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు. సినిమా ఏదైనా దుల్కర్ సల్మాన్ డైలాగ్ చెబితే ఆ క్రేజే వేరు. లాంగ్వేజ్ ఏదైనా విజయ్ సేతుపతి ఉంటే ఆ ఊపే వేరు. మూవీ ఎలాంటిదైనా సంజయ్ దత్ సీన్ ఉంటే ఆ వెయిటే వేరు. జానర్ ఏదైనా ఫహాద్ ఫాజిల్ ఉంటే ఆ కిక్కేవేరు. ఇలా సినిమా ఇండస్ట్రీతో పనిలేకుండా అందరికీ ఈ క్రేజీ ఆర్టిస్టులే కావాలంటూ డిమాండ్ పెరిగిపోయింది.

ప్రజెంట్ పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్టిస్ట్ అయిపోయారు దుల్కర్ సల్మాన్. ఆల్రెడీ మలయాళ, తమిళ్ లో బిజీగా ఉన్నదుల్కర్ తెలుగులో మహానటి, సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగులో కూడా మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయారు. ఈ క్రేజ్ కి తోడు ఇప్పుడు హిందీలో కూడా దుల్కర్ కి ఆఫర్లొస్తున్నాయి. ఆల్రెడీ హిందీలో చేసిన చుప్ సినిమాతో బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. దాంతో దుల్కర్ క్యామియో చేసినా చాలంటూ ఆఫర్లు పెరిగిపోయాయి.

ఇక తమిళ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ కేక్. విజయ్ సేతుపతి సినిమాలో ఉంటే చాలు. సినిమాకి కావల్సినంత క్రేజ్, హైప్ వస్తుందని వెంటపడి మరీ విజయ్ కి ఛాన్సులిస్తున్నారు. తమిళ్ లో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెన, సైరా, మైఖేల్.. లాంటి పలు సినిమాల్లో చేసిన క్యారెక్టర్ లతో టాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ అయ్యారు. పుష్ప 2లో విలన్ గా విజయ్ సేతుపతి కోసమే సుకుమార్ అండ్ టీమ్ గట్టిగా ట్రై చేశారని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రేజ్ తో పాటు హిందీలో ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ చేసిన ఫర్జీ సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో విజయ్ సేతుపతి తమ సినిమాల్లో ఉండాలని బాలీవుడ్ కూడా ఆశపడుతోంది. ఇప్పటికే కత్రినా కైఫ్ తో మెర్రీ క్రిస్మస్ సినిమా చేస్తున్న విజయ్ సేతుపతిని షారూఖ్ ఖాన్ తన జవాన్ మూవీ లో విలన్ గా ఫిక్స్ చేసుకున్నారు. దాంతో విజయ్ సేతుపతి తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అయిపోయారు.

మలయాళ స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ని కూడా ఏ ఇండస్ట్రీ వదలడం లేదు. మలయాళం లో టాప్ హీరో అయిన పృధ్విరాజ్ తెలుగులో ఏకంగా ప్రభాస్ సలార్ సినిమాలో చేస్తున్నాడు. ఈ మలయాళ హీరోకి బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి. ఏకంగా అక్షయ్ కుమారే తన సినమాలో పృధ్విరాజ్ కి చాన్సిచ్చారు. ఆల్రెడీ సెల్ఫీ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న పృధ్విరాజ్ ని హిందీ బడేమియా-చోటేమియా లో విలన్ ని చేసేశారు. ఇలా మలయాళ, తమిళ్, తెలుగు, హిందీ అన్ని సినిమాలకీ హాట్ టాపిక్ అవుతున్నారు పృధ్విరాజ్ సుకుమారన్.

సౌత్ వాళ్లనే నార్త్ వాళ్లు పిలిచి మరీ ఆఫర్లిస్తున్నారు అనుకుంటుంటే హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు.. ఇలా ప్రతి చోటా బాలీవుడ్ ఆర్టిస్ట్ సంజయ్ దత్ కోసం పోటీపడుతున్నారు. KGF లో సంజయ్ దత్ చేసిన యాక్టింగ్ కి ఫిదా అయిపోయిన సినిమా వాళ్లు మా సినమాలో చెయ్యమంటే, మా సినిమాలో చెయ్యండి అంటూ ఆఫర్లిస్తున్నారు. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనగరాజ్ సినిమాలో విలన్ గా చేస్తున్నారు. అంతేకాదు తెలుగులో కూడా కొరటాల -ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ ని సెట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇలా సంజయ్ దత్ కూడా అటు హిందీ, కన్నడ, తమిళ్ తో పాటు తెలుగులో కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్టిస్ట్ అయిపోయారు.

బాలీవుడ్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఫామ్ లో ఉన్న నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా ఫుల్ డిమాండ్ లో ఉన్నారు. స్టార్ కాస్ట్ తో పనిలేకుండా ఏ సినిమా అయినా తన యాక్టింగ్ తో అదరగొట్టే నవాజుద్దీన్ లేటెస్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నపాన్ ఇండియా మూవీ సైంధవ్ లో నవాజుద్దీన్ పవర్ పుల్ విలన్ రోల్ చేస్తున్నారు. అంతకుముందు తమిళ్ లో కార్తిక్ సుబ్బరాజ్, రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన పేట మూవీ లో పవర్ పుల్ విలన్ గా అదరగొట్టారు. ఆల్రెడీ, హిందీ, తమిళ్ లో అదరగొట్టిన నవాజుద్దీన్ ఇప్పుడు తెలుగు వాళ్లకి కూడా దగ్గరవుతున్నారు.

తెలుగు, తమిళ్ లో హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా చేసిన జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా బిజీ అవుతున్నారు జగపతి బాబు. కన్నడ మూవీ కబ్జాతో పాటు మలయాళంలో కూడా ఇప్పటికే పులిమురుగన్, మధుర రాజా లాంటి చాలా సినిమాలు చేశారు. ఇలా సౌత్ లో అన్ని ఇండస్ట్రీల్లో బిజీగా ఉన్న జగపతి బాబు ఇప్పుడు హిందీలో సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో పవర్ ఫుల్ విలనిజాన్ని చూపించబోతున్నారు .

Sir Movie Scenes : సార్ సినిమా.. తెలుగులో లేని సీన్స్ తమిళ్ లో.. సీన్స్ కట్ చేశారా??

వీళ్లందరికి తోడు లేడి ఆర్టిస్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న వరలక్ష్మి లేడీ విలన్ గా మంచి పేరు తెచ్చుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉంది. మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఆఫర్లు వస్తున్నాయి. ఇక తెలుగులో అయితే కనీసం చిన్న క్యారెక్టర్ అయినా చేయాల్సిందే అని పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. ఇలా ఈ ఆర్టిస్టులంతా ఇప్పుడు పాన్ ఇండియా ఆర్టిస్టులుగా బిజీ బిజీగా ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా తమ నటనతో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.