Sai Pallavi : సాయిపల్లవి కశ్మీర్ ఫైల్స్ వ్యాఖ్యలపై విజయశాంతి సీరియస్..

విజయశాంతి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ''కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని, గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయిపల్లవి............

Sai Pallavi : సాయిపల్లవి కశ్మీర్ ఫైల్స్ వ్యాఖ్యలపై విజయశాంతి సీరియస్..

Vijayashanthi

Updated On : June 18, 2022 / 12:30 PM IST

Sai Pallavi :  రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో హీరోయిన్ సాయి పల్లవి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. గో హత్యలు చేస్తున్న వారిని సపోర్ట్ గా మాట్లాడుతూ, కశ్మీర్ పండిట్లని చంపడం, గో హత్యలు చేసే వాళ్ళని కొట్టడం ఒకటే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.

దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో సాయి పల్లవిని ట్రోల్ చేస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్స్ లో సాయి పల్లవిపై కేసులు నమోదు అయ్యాయి. పలువురు ప్రముఖులు సాయి పల్లవిని విమర్శిస్తున్నారు. తాజాగా మాజీ నటి, బీజేపీ ప్రతినిధి విజయశాంతి సాయి పల్లవి వ్యాఖ్యలపై సీరియస్ అయింది. సాయి పల్లవి వ్యాఖ్యలని ఖండిస్తూ ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ చేసింది.

విజయశాంతి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ”కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని, గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం. ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం, తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా?”

Telugu Indian Idol : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా వాగ్దేవి..

”ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిది. నేడు మనం మాట్లాడే ప్రతి మాటా క్షణాల్లో కోట్లాది మందికి చేరిపోతూ ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకుని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలి. ఏది ఏమైనా ఆ సినిమా ఆర్ధిక లాభాలతో ఆసక్తి ఉన్న నిర్మాణ సంబంధితులు, కశ్మీర్ ఫైల్స్ పోలిక తెచ్చి, ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో ఆ కథానాయికను సమస్యల్లోకి లాగినట్టుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం కూడా అందుతోంది” అని ట్వీట్ చేశారు. ఇప్పటివరకు ఈ వివాదంపై సాయిపల్లవి మాట్లాడకపోవడం గమనార్హం.