Vikrant Rona: ‘విక్రాంత్ రోణ’ దూకుడుకు వెనుకబడ్డ బాలీవుడ్ సినిమాలు.. మూడు రోజుల్లో దిమ్మతిరిగే కలెక్షన్లు..

బాక్సాఫీస్ వద్ద దక్షిణాది చిత్రాల శకం కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘విక్రాంత్ రోణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 100కోట్ల మార్కుకు దూసుకుపోతోంది.

Vikrant Rona: ‘విక్రాంత్ రోణ’ దూకుడుకు వెనుకబడ్డ బాలీవుడ్ సినిమాలు.. మూడు రోజుల్లో దిమ్మతిరిగే కలెక్షన్లు..

Vikronth Rona

Vikrant Rona: బాక్సాఫీస్ వద్ద దక్షిణాది చిత్రాల శకం కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘విక్రాంత్ రోణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 100కోట్ల మార్కుకు దూసుకుపోతోంది. సినిమా విడుదలైన జులై 28న తొలిరోజు రూ. 35కోట్లు వసూలు చేసింది. శనివారం నాటికి మూడు రోజుల్లో రూ. 80కోట్లు వసూళ్లను దాటింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. భారీ బడ్జెట్ తో నిర్మించిన హిందీ చిత్రాలైన షంషేర్, సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలు విక్రాంత్ రోణ దుకుడును అందుకోలేక పోయాయి.

Vikrant Rona: మెగాస్టార్ లాంఛ్ చేసిన విక్రాంత్ రోణ టీజర్.. మామూలుగా లేదుగా!

పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. విక్రాంత్ రోణ విడుదలైన మూడవ రోజు శనివారం రూ. 25కోట్లు రాబట్టినట్లు తెలిసింది. దీని వలన ప్రపంచ వ్యాప్తంగా సినిమా రాబట్టిన ఆదాయం మూడు రోజుల్లో రూ. 80 నుంచి రూ. 85కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ బాక్సాఫీస్ లెక్కలు ఇంకా వెల్లడి కాలేదు. రణబీర్ కపూర్ హీరోగా నటించిన షంషేరా తొమ్మిది రోజుల క్రితం విడుదలైంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 60కోట్లు వసూళ్లు చేసింది. మరోవైపు అక్షయ్ కుమార్ సినిమా సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 80కోట్లు వసూళ్లు చేసింది.

Vikrant Rona: విక్రాంత్ రోణ రిలీజ్‌కు రంగం సిద్ధం!

విక్రాంత్ రోణ సినిమా నాలుగు రోజులు (ఆదివారం) నాటికి రూ. 100కోట్ల మార్కును ఈజీగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విక్రాంత్ రోణ టాప్ పది కన్నడ చిత్రాల్లో ఒకటి. కేవలం మూడు రోజుల తర్వాత ఎక్కువ వసూళ్లు రాబట్టిన కన్నడ సినిమాల జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ సినిమా టాప్ 3లో నిలుస్తుందని అంచనావేస్తున్నారు. ప్రస్తుతం మొదటి రెండు స్థానాల్లో KGF, KGF-2  సినిమాలు  ఉన్నాయి.

విక్రాంత్ రోణ సినిమాకు అనూప్ భండారి దర్శకత్వం వహించాడు. హీరోగా కిచ్చా సుదీప్ తో పాటు నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా ₹95 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కన్నడ సినిమాల్లో అత్యంత బడ్జెట్ తో నిర్మించిన సినిమాల్లో విక్రాంత్ రోణ ఒకటి. ఆదివారం SS రాజమౌళి ట్విట్టర్‌లో “విక్రాంత్ రోనా విజయం సాధించినందుకు హీరో కచ్చా సుదీప్, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.