Vikrant Rona: మెగాస్టార్ లాంఛ్ చేసిన విక్రాంత్ రోణ టీజర్.. మామూలుగా లేదుగా!

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న తాజా చిత్రం విక్రాంత్ రోణ కోసం అక్కడి ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ఫిక్షనల్.....

Vikrant Rona: మెగాస్టార్ లాంఛ్ చేసిన విక్రాంత్ రోణ టీజర్.. మామూలుగా లేదుగా!

Chiranjeevi Launches Vikrant Rona Teaser

Vikrant Rona: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న తాజా చిత్రం విక్రాంత్ రోణ కోసం అక్కడి ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ఫిక్షనల్ అడ్వెంచర్ మూవీలో సుదీప్ పాత్ర చాలా సరికొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Vikrant Rona: విక్రాంత్ రోణ రిలీజ్‌కు రంగం సిద్ధం!

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ టీజర్‌ను పలు భాషల్లో పలువురు స్టార్స్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా తెలుగులో ఈ టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్‌లో రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా, సరికొత్త కాన్సెప్ట్‌ తో ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ టీజర్‌లో కొందరు చిన్నపిల్లలు వారి నానమ్మ డైరీ గురించి మాట్లాడుకుంటారు. అయితే ఆ డైరీలోని కథలో ఓ బూచాడు ఉంటాడని.. అతడు చాలా భయంకరంగా ఉంటాడని.. అతడి గురించి తెలుసుకోవాలని వారు ఆసక్తిగా మాట్లాడుకుంటారు.

Chiranjeevi: విక్రాంత్ రోణ కోసం చిరంజీవి, మోహన్ లాల్..!

కాగా ఆ బూచాడు పేరు ఏమిటి అనే క్రమంలో విక్రాంత్ రోణ అనే సినిమా టైటిల్ పేరును చిత్ర యూనిట్ చూపిస్తుంది. ఇక ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ రిలీజ్ డేట్ టీజర్‌లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న అంశం ఏమిటంటే ఈ సినిమాలోని బీజీఎం. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను అనూప్ భండారీ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్, నీతా అశోక్, నిరూప్ భండారీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విక్రాంత్ రోణ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూలై 28న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి ఈ సినిమాతో సుదీప్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.