Chiranjeevi: విక్రాంత్ రోణ కోసం చిరంజీవి, మోహన్ లాల్..!

కన్నడ స్టార్ హీరో సుదీప్‌కు అక్కడ ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నటించిన సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక ఈ హీరో నటిస్తున్న.....

Chiranjeevi: విక్రాంత్ రోణ కోసం చిరంజీవి, మోహన్ లాల్..!

Vikrant Rona Teaser To Be Launched By Chiranjeevi And Mohan Lal

Chiranjeevi: కన్నడ స్టార్ హీరో సుదీప్‌కు అక్కడ ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నటించిన సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా, ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కాగా, తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లాంఛ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.

Vikrant Rona: విక్రాంత్ రోణ రిలీజ్‌కు రంగం సిద్ధం!

ఇక విక్రాంత్ రోణ చిత్ర టీజర్‌ను పలు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే విక్రాంత్ రోణ టీజర్‌ను చిత్ర యూనిట్ దక్షిణాది స్టార్ హీరోల చేతుల మీదుగా రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే తెలుగులో విక్రాంత్ రోణ టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవ్వగా, మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు.

Kichha Sudeep : జానీ మాస్టర్‌కి స్పెషల్ కార్‌ని గిఫ్ట్ ఇచ్చిన కన్నడ స్టార్ హీరో

ఈ టీజర్‌ను ఏప్రిల్ 2న ఉదయం 9.55 గంటలకు సోషల్ మీడియా వేదికగా ఈ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాలో సుదీప్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఔట్ అండ్ ఔట్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ‘విక్రాంత్ రోణ’ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్, నీతా అశోక్ హీరోయిన్లుగా నటిస్తుండగా అనూప్ భండారి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ టీజర్‌లో సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.