Vikrant Rona: విక్రాంత్ రోణ రిలీజ్‌కు రంగం సిద్ధం!

కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ ఎప్పటి నుండో ప్రేక్షకులను ఊరిస్తూ వస్తోంది. దర్శకుడు.....

Vikrant Rona: విక్రాంత్ రోణ రిలీజ్‌కు రంగం సిద్ధం!

Kichcha Sudeep Vikrant Rona Release Teaser On The Way

Updated On : March 29, 2022 / 4:09 PM IST

Vikrant Rona: కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ ఎప్పటి నుండో ప్రేక్షకులను ఊరిస్తూ వస్తోంది. దర్శకుడు అనూప్ భండారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తి ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్‌గా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

Kichha Sudeep : జానీ మాస్టర్‌కి స్పెషల్ కార్‌ని గిఫ్ట్ ఇచ్చిన కన్నడ స్టార్ హీరో

ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, ఇప్పుడు సరికొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన టీజర్‌ను ఏప్రిల్ 2న ఉదయం 9.55 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాను దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

అంతేగాక ఈ సినిమాను ఎవరి ఊహలకు అందకుండా ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యిందట. కిచ్చా సుదీప్ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న విక్రాంత్ రోణ చిత్రంలో జాక్వెలిన్ ఫర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని సుదీప్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.