Virupaksha Movie: ట్రైలర్‌ను పట్టుకొస్తున్న విరూపాక్ష.. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న కొత్త పోస్టర్!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ‘విరూపాక్ష’ త్వరలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ఓ కొత్త పోస్టర్‌తో చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Virupaksha Movie: ట్రైలర్‌ను పట్టుకొస్తున్న విరూపాక్ష.. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న కొత్త పోస్టర్!

Virupaksha Movie Trailer To Be Out Soon

Updated On : April 5, 2023 / 9:31 PM IST

Virupaksha Movie: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన మూవీ ‘విరూపాక్ష’. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నాడు. మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా నుండి ఇటీవల వరుస అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర యూనిట్.

Virupaksha: విరూపాక్ష ముగించేశాడు.. కానీ అది మిగిలే ఉంది!

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా నుండి తాజాగా మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విరూపాక్ష ట్రైలర్‌ను త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు ఈ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. సాయిధరమ్‌ తేజ్ వెనుక పక్షి రెక్కలతో ఉన్న ఈ పోస్టర్ చూసి అభిమానులు స్టన్ అవుతున్నారు. సాయి ధరమ్ తేజ్ సరికొత్తగా కనిపిస్తున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Virupaksha: ‘నచ్చావులే నచ్చావులే’ అంటూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన విరూపాక్ష

ఇక ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, బ్లాక్ మేజిక్ అనే అంశం చుట్టూ ఈ సినిమా కథ ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇటీవల పేర్కొంది. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తోండగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న రిలీజ్ చేస్తున్నారు.