Vishwak Sen : మరో సీక్వెల్ అనౌన్స్ చేసిన విశ్వక్.. ఏ మూవీకో తెలుసా?

దాస్ కా ధమ్కీ సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేసిన విశ్వక్ సేన్.. ఇప్పుడు మరో సినిమాకి సీక్వెల్ ని ప్రకటించాడు. అది ఏ సినిమా అంటే..

Vishwak Sen : మరో సీక్వెల్ అనౌన్స్ చేసిన విశ్వక్.. ఏ మూవీకో తెలుసా?

Vishwak Sen announce sequel for his super hit movie Falaknuma Das

Updated On : May 31, 2023 / 7:32 PM IST

Vishwak Sen New Movie : టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki) అంటూ రీసెంట్ గా బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఆ మూవీ ఎండ్ టైటిల్స్ లోనే దానికి సీక్వెల్ ఉండబోతుందని తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో సినిమాకి కూడా సీక్వెల్ ని అనౌన్స్ చేశాడు. ఇండస్ట్రీలో తనకి మంచి గుర్తింపుని తీసుకొచ్చిన సినిమా ‘ఫలక్‌నుమా దాస్‌’ (Falaknuma Das). ఈ మూవీ రిలీజ్ అయ్యి నాలుగేళ్లు అవ్వడంతో సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ వేశాడు.

SSMB28 Title Glimpse : బీడీ 3d లో కనబడుతోందా.. మహేష్ మాస్ స్ట్రైక్ అదిరిపోయింది!

ఫలక్‌నుమా దాస్‌ చిత్రం మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అంగమాలి డైరీస్‌’కి రీమేక్ గా వచ్చింది. దీనిని విశ్వక్ సేన్ నటిస్తూనే దర్శకత్వం కూడా చేశాడు. ఇక ఈ సినిమా తనని ఒక నటుడిగానే కాకుండా ఒక మనిషిగా తీర్చిదిద్దిన చిత్రం అని విశ్వక్ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ ఇండస్ట్రీలో తనకి ఎన్నో అవకాశాలు వచ్చేలా చేసిందని పేర్కొన్నాడు. తనకి ఇంతటి సపోర్ట్ ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మరియు మీడియాకి కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే ఫలక్‌నుమా దాస్‌ కి సీక్వెల్ తీసుకు వస్తానని ప్రకటించాడు.

Al Pacino : 83 ఏళ్ల వయసులో ఫాదర్ కాబోతున్న హాలీవుడ్ గాడ్‌ఫాదర్.. అది కూడా 29 ఏళ్ల ప్రేయసితో!

ఈసారి వంద రెట్లు స్ట్రాంగ్‌గా ఫలక్‌నుమా దాస్‌ కథ ఉంటుందని తెలియజేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకి కూడా సీక్వెల్ ని తీసుకు రమ్మని కోరుతున్నారు. కాగా విశ్వక్ ప్రస్తుతం గామి, VS10, VS11 చిత్రాల్లో నటిస్తుండగా.. గామి షూటింగ్ పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే, విశ్వక్ నటించిన తమిళ్ మూవీ ఒకటి నేరుగా ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ‘బూ’ (boo) అనే హారర్ మూవీలో విశ్వక్, నివేదా పేతురాజ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, మేఘా ఆకాశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జియో సినిమా (jio cinema) లో ఈ మూవీ ప్రసారం అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Vishwaksen (@vishwaksens)