vivo-iQoo Smartphone: ఐక్యూ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్ లో విడుదల చేసిన వివో

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో..తమ సబ్ బ్రాండ్ ఐక్యూ నుంచి మూడు కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను బుధవారం భారత్ లో విడుదల చేసింది.

vivo-iQoo Smartphone: ఐక్యూ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్ లో విడుదల చేసిన వివో

Iqoo

vivo-iQoo Smartphone: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో..తమ సబ్ బ్రాండ్ ఐక్యూ(iQoo) నుంచి మూడు కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను బుధవారం భారత్ లో విడుదల చేసింది. ఐక్యూ 9, ఐక్యూ 9 SE, ఐక్యూ 9 ప్రో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. క్వాల్ కామ్ సంస్థ తమ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్లలో అభివృద్ధి చేసిన హై ఎండ్ ” 8 జెన్ 1 చిప్ సెట్”తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. స్మార్ట్ ఫోన్ లలో “గింబల్” కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్ తో వస్తున్న ఈ ఫోన్లలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఫ్లాగ్ షిప్ ఫోన్లలో ఇతర సంస్థలతో పోల్చితే.. ఐక్యూ 9 సిరీస్ లో సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. మరి ఆ ఫీచర్లు ఏంటంటే..

Also read: Google Employees: ఆఫీసుకు వచ్చే ఉద్యోగులకు వ్యాక్సిన్ నిబంధనను ఎత్తేసిన గూగుల్

సాధారణంగా ఒకే సిరీస్ లో ఉండే ఫోన్లలో ఫీచర్లు మారుతుంటాయి. కానీ ఈ ఐక్యూ 9 సిరీస్ లో మూడు స్మార్ట్ ఫోన్ లు కూడా 120Hz స్క్రీన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తున్నాయి. మూడు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 12 ఓఎస్, హై ఎండ్ ” స్నాప్ డ్రాగన్ చిప్ సెట్”తో వస్తున్నాయి. ఇది కాకుండా, ఈ స్మార్ట్ ఫోన్ లు మొబైల్ గేమింగ్ అనుభవాన్ని మరింత ఆకర్శించే విధంగా ప్రత్యేక డిస్ప్లే చిప్ ను కలిగి ఉన్నాయని ఐక్యూ సంస్థ తెలిపింది. అయితే ఐక్యూ 9 ప్రో మరియు ఐక్యూ 9 ఫోన్లలో ‘గింబల్’ కెమెరా ఫీచర్ ఉండగా, ఎస్ఈ వేరియంట్లో మాత్రం సాధారణ కెమెరా సెటప్ ఉంటుంది.

Also read: iPhone 13 Gift to MLAs : అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికి ఐఫోన్ 13 సర్‌ప్రైజ్‌ గిఫ్ట్..!

ఐక్యూ 9 ప్రో ఫీచర్లు: ఐక్యూ 9 ప్రో ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేటుతో కలిగిఉన్న 6.78 అంగుళాల క్వాడ్ HD+ డిస్ప్లే ఉంది. వెనుక భాగంలో 50MP + 50MP + 16MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా అమర్చారు. కేబుల్ తో 120W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్ లెస్ గా 50W ఛార్జింగ్ అవుతుంది. అంతే కాదు మొట్టమొదటి సరిగా 10W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఈ ఐక్యూ 9 ప్రోలో అందుబాటులోకి తెచ్చారు.
ఐక్యూ 9 ఫీచర్లు: ఐక్యూ 9 స్మార్ట్ ఫోన్ లో 6.56 అంగుళాల FHD+ డిస్ప్లే ఉంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. గింబల్ స్టెబిలైజేషన్ తో 48 MP ప్రైమరీ కెమెరా, 13 MP అల్ట్రావైడ్ యాంగిల్, 13 MP పోర్ట్రైట్ కెమెరాతో పాటు.. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
ఐక్యూ 9 SE ఫీచర్లు: ఐక్యూ 9 SE ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేటుతో 6.62 అంగుళాల FHD + డిస్ప్లే ఉంది. స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్ తో పనిచేస్తుంది. వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 48 MP ప్రైమరీ కెమెరా, 13 MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా స్నాపర్ మరియు 2 MP మోనోక్రోమ్ కెమెరాతో పాటు ముందు భాగాన 16MP సెల్ఫీ కెమెరా ఉంది. 4,500mAh బ్యాటరీ కలిగిన ఈ ఐక్యూ 9 SE 66W ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తుంది.