VV Vinayak : బాలకృష్ణ చెల్లెలి పాత్రకి అడిగితే ఏడ్చేసింది.. ఇండస్ట్రీలో తల్లి, చెల్లి పాత్రలు వెతకడం కష్టం..

వివి వినాయక్ మాట్లాడుతూ.. ''చెన్నకేశవరెడ్డి సినిమాలో టబు పాత్రకు ముందుగా సౌందర్యను అడిగాను. కానీ ఓల్డ్‌ పాత్ర అప్పుడే చేయను అని చెప్పింది. ఆ తర్వాత టబును అడిగితే...............

VV Vinayak : బాలకృష్ణ చెల్లెలి పాత్రకి అడిగితే ఏడ్చేసింది.. ఇండస్ట్రీలో తల్లి, చెల్లి పాత్రలు వెతకడం కష్టం..

chennakeshavareddy

VV Vinayak :  కొంతమంది హీరోయిన్స్ అవకాశాలు రాకపోయినా ఆగుతారు కానీ చెల్లి పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడిగితే చేయము అని చెప్పేస్తారు. మరి కొంతమంది నటనకి స్కోప్ దొరుకుతుందని ఒప్పుకుంటారు. ఫ్యాక్షన్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన వివి వినాయక్ బాలకృష్ణతో తీసిన చెన్నకేశవరెడ్డి సినిమా ఒక మంచి క్లాసిక్ సినిమాలా నిలిచింది.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివి వినాయక్ ఈ సినిమా తీసిన సమయంలో కొన్ని విశేషాలని తెలియచేశారు. ఈ నేపథ్యంలోనే ఓ హీరోయిన్ ని బాలకృష్ణ చెల్లెలి పాత్రకి అడిగితే ఏడ్చేసింది అని, ఇండస్ట్రీలో తల్లి, చెల్లి పాత్రలకు ఆర్టిస్టులని వెతకడం కష్టమని అన్నారు.

వివి వినాయక్ మాట్లాడుతూ.. ”చెన్నకేశవరెడ్డి సినిమాలో టబు పాత్రకు ముందుగా సౌందర్యను అడిగాను. కానీ ఓల్డ్‌ పాత్ర అప్పుడే చేయను అని చెప్పింది. ఆ తర్వాత టబును అడిగితే వెంటనే ఒప్పుకుంది. ఇక బాలకృష్ణ చెల్లెలి క్యారెక్టర్ కి ముందుగా స్వయంవరం హీరోయిన్‌ లయను అడిగాను. ఆమె వెంటనే ఏడ్చేస్తూ చెల్లెలి పాత్రకే ఎందుకు అడుగుతారు? తెలుగమ్మాయిలు హీరోయిన్‌గా పని చేయరా? అని అడిగింది. మీ ముఖం అమాయకంగా ఉంటుంది, బాగా సెట్ అవుతుంది అని చెప్తే అలా ఎందుకు చూస్తారు? హీరోయిన్‌గా ఎందుకివ్వరు? అని ప్రశ్నించింది. దీంతో చేసేదేం లేక నేను సారీ చెప్పి వచ్చేశాను. ఆ తర్వాత దేవయానిని అడిగితే ఒప్పుకుంది. మన ఇండస్ట్రీలో తల్లి, చెల్లెలి పాత్రలకు ఆర్టిస్టులు దొరకడం చాలా కష్టం. అంత తొందరగా ఎవరూ ఒప్పుకోరు” అని చెప్పారు.

Vishal Injured in Shooting : మళ్ళీ షూటింగ్ లో హీరో విశాల్ కు గాయాలు.. వరుస గాయాలతో సతమతవుతున్న విశాల్..

ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు లయ నిజంగానే మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది, చేసి ఉంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా బిజీగా ఉండేది, ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.