Waltair Veerayya : ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసిన వాల్తేరు వీరయ్య..

ఒకప్పటి వింటేజ్ చిరంజీవిని చూపిస్తూ తెరకెక్కుతున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. నిన్న ఫైనల్ అవుట్ ఫుట్ చూసిన మేకర్స్ పూనకాలు తప్పని సరి అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్న మూవీ టీం. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ డేట్‌ని అనౌన్స్ చేశారు.

Waltair Veerayya : ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసిన వాల్తేరు వీరయ్య..

Waltair Veerayya trailer date announce

Updated On : January 6, 2023 / 10:27 AM IST

Waltair Veerayya : ఒకప్పటి వింటేజ్ చిరంజీవిని చూపిస్తూ తెరకెక్కుతున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా ఒక ముఖ్యపాత్ర చేస్తున్నాడు. కె బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. నిన్న ఫైనల్ అవుట్ ఫుట్ చూసిన మేకర్స్ పూనకాలు తప్పని సరి అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Waltair Veerayya: రన్‌టైమ్ లాక్ చేసుకున్న వాల్తేరు వీరయ్య.. ఎంతో తెలుసా?

ఇక వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్న మూవీ టీం. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ డేట్‌ని అనౌన్స్ చేశారు. థియేటరికల్ ట్రైలర్ ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ టైం మాత్రం తెలియజేయలేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జనవరి 8న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మొదటిగా ఈ ఈవెంట్ ని వైజాగ్ ఆర్‌కె బీచ్‌లో అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భహిరంగ సభలుపై కొత్తగా విధించిన ఆంక్షాలతో మూవీ టీం కన్‌ఫ్యూషన్‌లో పడింది.

అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ ని వైజాగ్ లోనే ఆంధ్రా యూనివర్సిటీకి మార్చినట్లు తెలుస్తుంది. ఇందుకు పోలీస్ వారు కూడా ఒకే చెప్పడంతో, ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏయూలో నిర్వహించనున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి గ్యాంగ్‌స్టార్‌గా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.