Waltair Veerayya: రన్‌టైమ్ లాక్ చేసుకున్న వాల్తేరు వీరయ్య.. ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ మేనియా అప్పుడే షురూ అయ్యింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమా సెన్సార్ పనులను ముగించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది.

Chiranjeevi Waltair Veerayya Locks Runtime
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ మేనియా అప్పుడే షురూ అయ్యింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమా సెన్సార్ పనులను ముగించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది.
Waltair Veerayya: సెన్సార్ పనులు ముగించుకున్న ‘వాల్తేరు వీరయ్య’
వాల్తేరు వీరయ్య మూవీ రన్‌టైమ్‌ను 2 గంటల 40 నిమిషాలుగా ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ మేరకు సెన్సార్ సర్టిఫికెట్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతటి లెంగ్తీ రన్ టైమ్‌తో సినిమా వస్తుందంటే, చిత్ర యూనిట్ ఈ సినిమాపై ఏ రేంజ్‌లో కాన్ఫిడెంట్‌గా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
Waltair Veerayya : ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ’ అంటూ మరో పాట లీక్ చేసిన చిరు..
ఇక ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాలో చిరు, రవితేజ కలిసి చేసే యాక్షన్‌ను చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. కాగా ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మైత్రీ మేవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.